తాజాగా ఢీ 14 షో ప్రోమో రిలీజ్ చేశారు. ఆగష్టు 24న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై వైరల్ గా మారింది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ అంతా అద్భుతమైన మూమెంట్స్ తో ఆకట్టుకుంటున్నారు. శ్రద్దా దాస్, పూర్ణ, జానీ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రోమోలో శ్రద్దా దాస్, హైపర్ ఆది రొమాంటిక్ ట్రాక్ హైలైట్ గా నిలిచింది.