అప్పటిదాకా అమ్మాయిలతో చిందులేస్తూ.. ఆ లెటర్ చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న హైపర్ ఆది..

Published : Sep 12, 2022, 08:18 PM IST

ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది పెర్ఫామెన్స్ హైలైట్ అవుతోంది.  యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బులెట్ భాస్కర్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తున్నారు.

PREV
16
అప్పటిదాకా అమ్మాయిలతో చిందులేస్తూ.. ఆ లెటర్ చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న హైపర్ ఆది..

ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది పెర్ఫామెన్స్ హైలైట్ అవుతోంది.  యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, బులెట్ భాస్కర్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. 

26

సెప్టెంబర్ 18న ప్రసారం అయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. జోడి నంబర్ 1 పేరుతో ఈ ఎపిసోడ్ డిజైన్ చేశారు. సుజాత, రాకింగ్ రాజేష్ రొమాంటిక్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. పంచ్ ప్రసాద్ తన భార్యతో కలసి హాజరయ్యాడు. దీనితో పంచ్ ప్రసాద్ రియల్ లైఫ్ ని స్కిట్ రూపంలో కొందరు చేసి చూపించారు. 

36

పంచ్ ప్రసాద్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయినప్పటికీ అతడి భార్య తన భర్త కోసం ఎంతగా పరితపిస్తుందో చూపించారు. ఈ స్కిట్ ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కేలా చేస్తోంది. ప్రేమించిన వాడికోసం జీవితాన్నే త్యాగం చేసిన అమ్మాయి .. పంచ్ ప్రసాద్ భార్య అంటూ హైపర్ ఆది ప్రశంసించాడు. 

46

అనంతరం వారి వారి గర్ల్ ఫ్రెండ్స్ ని ఎత్తుకుని మ్యూజికల్ చైర్స్ ఆడారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి గేమ్ ప్రతి ఎపిసోడ్ లో ఉండాలి అని హైపర్ ఆది అందడంతో నవ్వులు విరిశాయి. హైపర్ ఆది తన గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకోలేక కింద పడిపోతాడు. ఈ సమరంలో ప్రాణాలు పోయినా సరే ఆపేది లేదు అని అందడంతో అంతా నవ్వేస్తారు. ఈ షోకి ఢీ పూర్ణ గెస్ట్ గా హాజరైంది. 

56

యాంకర్ రష్మీ ఈ ఎపిసోడ్ లో ప్రతి ఒక్కరికి లవ్ గిఫ్ట్స్ వచ్చాయని చెబుతుంది. హైపర్ ఆదికి కూడా ఒక గిఫ్ట్ వస్తుంది. అప్పటి వరకు అమ్మాయిలతో చిందులేస్తూ హుషారుగా కనిపించిన హైపర్ ఆది.. ఆ గిఫ్ట్ చూడగానే కంటతడి పెట్టుకుంటాడు. 

66

ఆ గిఫ్ట్ లో ఉన్నది హైపర్ ఆది టెన్త్ క్లాస్ లో రాసిన ప్రేమ లేఖ. తాను రాసిన తొలి ప్రేమ లేఖని చూసుకుని హైపర్ ఆది ఎమోషనల్ అవుతాడు. ఆ లవ్ లెటర్ లో ఏముందో అని కంప్లీట్ ఎపిసోడ్ లో చదివి వినిపిస్తాడు. టీనేజ్ లో తొలి ప్రేమ చేసిన తీపి గాయాన్ని తలుచుకుని హైపర్ ఆది ఒక్కసారిగా ఎమోషనల్ గా మారిపోయాడు. 

Read more Photos on
click me!

Recommended Stories