మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివకి ఈ చిత్రం తొలి ఎదురుదెబ్బ. మెగా అభిమానులైతే ఈ ఫెయిల్యూర్ ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొరటాల స్క్రిప్ట్, దర్శకత్వం పూర్తిగా బెడిసికొట్టాయి. దీనికి తోడు సంగీతం పరంగా మణిశర్మ పూర్తిగా చేతులెత్తేశారు.