KGF Chapter 2: యష్ దెబ్బకు రజనీ రికార్డు అవుట్... తెలుగు గడ్డపై చరిత్ర సృష్టించిన కెజిఎఫ్ 2

Published : Apr 12, 2022, 03:33 PM IST

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) ఫీవర్ తగ్గకముందే కెజిఎఫ్ మేనియా సినిమా ప్రియులను పట్టేసింది. ప్రశాంత్ నీల్- యష్ కాంబినేషన్ లో తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం దునియా మొత్తం ఎదురుచూస్తుంది. దేశవ్యాప్తంగా హైప్ నెలకొన్న కెజిఎఫ్ తెలుగులో భారీ ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. యష్ ఏకంగా రజినీకాంత్ రికార్డు బ్రేక్ చేశారు.   

PREV
15
KGF Chapter 2: యష్ దెబ్బకు రజనీ రికార్డు అవుట్... తెలుగు గడ్డపై చరిత్ర సృష్టించిన కెజిఎఫ్ 2
Yash - kgf chapter 2


చాలా కాలంగా టాలీవుడ్ పై కోలీవుడ్ ఆధిపత్యం కొనసాగుతుంది. ముఖ్యంగా రజినీకాంత్ (Rajinikanth) సినిమాలకు తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు స్టార్స్ కి సమానంగా ఆయన చిత్రాలు బిజినెస్ జరుపుకుంటాయి. రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ 2.0 డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ జరిపిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. యష్ నటించిన కెజిఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2) ఈ రికార్డు బ్రేక్ చేసింది. 

25

కెజిఎఫ్ చాప్టర్ 2 రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అలా 2.0 పేరిట ఉన్న డబ్బింగ్ చిత్రాల రికార్డు కెజిఎఫ్ చాప్టర్ 2 తుడిచిపెట్టింది. తెలుగులో భారీగా మార్కెట్ ఉన్న సూర్య, విక్రమ్, కమల్, విజయ్, అజిత్ బీట్ చేయలేని రికార్డు యష్ చేశారు. సౌత్ ఇండియా నుండి పాన్ ఇండియా స్టార్ గా నిరూపించుకున్నారు.

35

ఇక కెజిఎఫ్ చాప్టర్ 2, 2.0 చిత్రాల తర్వాత టాప్ ఫైవ్ లో ఉన్న చిత్రాలు చూస్తే... విక్రమ్ ఐ మూవీ మూడవ స్థానంలో ఉంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఐ మూవీపై అప్పట్లో భారీ హైప్ నెలకొంది. ఈక్రమంలో ఐ మూవీ రూ. 39 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అయితే అనుకున్న స్థాయిలో చిత్రం విజయం సాధించలేదు.

45

దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన కాల, కబాలి చిత్రాలు 4,5 స్థానాలు సొంతం చేసుకున్నాయి. కాల మూవీ రూ. 33 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేయగా, కబాలి రూ. 31 కోట్లకు అమ్ముడుపోయింది. టాప్ ఫైవ్ లో ఇక చిత్రంతో యష్, మూడు చిత్రాలతో రజినీకాంత్, ఒక చిత్రంతో విక్రమ్ ఉన్నారు.

55

టాప్ సిక్స్ ప్లేస్  కూడా రజినీకాంత్ దే కావడం విశేషం. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ సైన్స్ ఫిక్షన్ మూవీ రోబో రూ. 27 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది.

click me!

Recommended Stories