ముంబైలో 'పుష్ప 2' భారీ ఈవెంట్.. దేవరని మించేలా ప్లానింగ్

First Published | Oct 11, 2024, 5:55 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రానికి సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కటి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సుకుమార్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన భారీ క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారట.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రానికి సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కటి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సుకుమార్ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన భారీ క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారట. కనీవినీ ఎరుగని విధంగా క్లైమాక్స్ ఉండేలా మూడు వెర్షన్స్ గా చిత్రీకరణ జరుగుతోంది. 

డిసెంబర్ 6న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలని ఒక రేంజ్ లో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దీపావళి తర్వాత నుంచి ప్రచార కార్యక్రమాలు మొదలవుతాయట. అయితే పుష్ప చిత్రానికి ప్రాణం పోసింది మాత్రం నార్త్ ఆడియన్స్. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప చిత్రానికి నష్టాలు తప్పలేదు. 


కానీ నార్త్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుని 100 కోట్ల వరకు కలెక్షన్స్ ఇచ్చారు. పుష్ప సాంగ్స్ అంతలా నార్త్ ఆడియన్స్ లో క్రేజ్ పెంచాయి. ఇప్పుడు పుష్ప 2పై కూడా నార్త్ లో భారీ అంచనాలు ఉన్నాయి. నార్త్ లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో ముంబైలో పుష్ప 2 చిత్ర యూనిట్ భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. 

ముంబై వేదికగా పుష్ప చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ట్రైలర్ లాంచ్ తో మొదలు పెట్టి అల్లు అర్జున్ , చిత్ర యూనిట్ దేశం మొత్తం పర్యటించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

Latest Videos

click me!