Sridevi: పెళ్లయిన వ్యక్తిని చేసుకోను అన్న శ్రీదేవి.. ఇద్దరు పిల్లల తండ్రికి భార్య ఎలా అయిందంటే!

Published : Nov 01, 2026, 02:39 PM IST

Sridevi: అందాల తార శ్రీదేవి నిజ జీవితం కూడా ఓ సినిమా కథలాగే ఉంటుంది. 'పెళ్లయిన వ్యక్తిని నేను ఎప్పటికీ చేసుకోను' అని చెప్పిన శ్రీదేవి.. చివరికి ఇద్దరు పిల్లల తండ్రి అయిన బోనీ కపూర్‌తో ప్రేమలో పడటానికి ఓ బలమైన కారణం ఉంది.

PREV
15
శ్రీదేవి పెళ్లి సీక్రెట్..

శ్రీదేవి, బోనీ కపూర్ ప్రేమకథ అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద సెన్సేషన్. 'పెళ్లయిన వ్యక్తిని ఎప్పటికీ చేసుకోను' అని చెప్పిన శ్రీదేవి.. ఇద్దరు పిల్లల తండ్రి అయిన బోనీ కపూర్‌ను తన జీవిత భాగస్వామిగా ఎలా ఎంచుకున్నారు? ఈ ప్రేమకథ వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి.

25
శ్రీదేవిపై ప్రేమ చూపించిన నిర్మాత..

బోనీ కపూర్ 1970ల కాలంలో సౌత్ సినిమాల్లో నటిస్తున్న శ్రీదేవిని చూసిన మొదటిసారే ఆమె అందం, నటనకు ఫిదా అయ్యారు. ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మిస్టర్ ఇండియా' సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవికి ఆయన ప్రత్యేకంగా చూసుకున్నారు. అప్పట్లో హీరోయిన్లకు పెద్దగా అందుబాటులో లేని వానిటీ వ్యాన్‌ను ఆమె కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బోనీ చూపించిన ఈ కేరింగ్, గౌరవం శ్రీదేవి మనసు గెలుచుకున్నాయి.

35
శ్రీదేవి కుటుంబానికి పెద్దదిక్కుగా..

శ్రీదేవి తండ్రి చనిపోయినప్పుడు బోనీ కపూర్ ఆమె కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడ్డారు. ఆ కష్టకాలంలో ఆయన చూపించిన ప్రేమ, కేరింగ్ వాళ్లిద్దరి బంధాన్ని మరింత బలపరిచాయి. అయితే అప్పటికే బోనీ కపూర్‌కు పెళ్లయింది. ఆయన 1983లో మోనా శౌరి కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

45
ఇండస్ట్రీలో రకరకాల రూమర్లు..

శ్రీదేవికి బోనీ కపూర్ మొదటి భార్య మోనాతో మంచి పరిచయం ఉండేది. తన భర్త శ్రీదేవితో ప్రేమలో ఉన్నాడనే విషయం తెలిశాక మోనా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం అప్పట్లో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో శ్రీదేవి కొన్ని రోజుల పాటు బోనీ కపూర్ ఇంట్లోనే ఉన్నారని, అప్పటికే ఆమె గర్భవతి అనే వార్తలు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపాయి.

శ్రీదేవి పేరు బోనీ కపూర్‌తో ప్రేమలో పడకముందు మిథున్ చక్రవర్తి, జితేంద్ర లాంటి స్టార్ హీరోలతో వినిపించింది. ఆ టైమ్‌లోనే 'పెళ్లయిన వ్యక్తిని నేను ఎప్పటికీ చేసుకోను' అని శ్రీదేవి ఓపెన్‌గా చెప్పారు. కానీ చివరికి బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. వీళ్లిద్దరూ 1996 జూన్ 2న చాలా సీక్రెట్‌గా, సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1997లో జాన్వీ కపూర్, 2000లో ఖుషీ కపూర్ పుట్టారు.

55
శ్రీదేవి మరణం తర్వాత..

ఈ పెళ్లి వల్ల బోనీ కపూర్ మొదటి కుటుంబంతో దూరం పెరిగింది. శ్రీదేవి, అర్జున్ కపూర్ మధ్య చాలా ఏళ్ల పాటు మాటలు లేవు. అయితే 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో శ్రీదేవి హఠాన్మరణం దేశవ్యాప్తంగా అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ విషాద సమయంలో అర్జున్ కపూర్, అన్షులా కపూర్ తమ చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు అండగా నిలబడ్డారు. అలా ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు శ్రీదేవి మరణం తర్వాత మళ్లీ దగ్గరయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories