Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ

Published : Sep 22, 2026, 10:45 AM IST

Bigg Boss 10 Actor Krishnudu: నటుడు కృష్ణుడు బిగ్ బాస్ 10 నుండి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. హౌస్ ఇన్‌సైడ్ ముచ్చట్లు, రోహిత్ గేమ్, లవ్ ట్రాక్‌లపై కృష్ణుడు మాట్లాడిన అసలు నిజాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఎవరినీ అనను.. నేను ఎలిమినేట్ కావాల్సిన వాడినే

రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుండి నటుడు కృష్ణుడు రెండో వారంలోనే ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ఒక రోజు తర్వాత, జియోహాట్‌స్టార్ లో జరిగిన ఒక ప్రసారంలో కృష్ణుడు ప్రత్యక్షంగా పాల్గొని తన బిగ్ బాస్ ప్రయాణంపై, తోటి కంటెస్టెంట్లపై సంచలన కామెంట్స్ చేశారు. సాధారణంగా ఎలిమినేట్ అయిన ప్లేయర్స్ ఓటింగ్ విధానాన్ని, ఇతరుల ప్రవర్తనను లేదా అదృష్టాన్ని నిందిస్తూ ఉంటారు. కానీ కృష్ణుడు మాత్రం చాలా హుందాగా, నిష్కపటంగా మాట్లాడుతు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

25
నాకు ఎలాంటి బాధ లేదు

లైవ్ ఇంటరాక్షన్‌లో కృష్ణుడు మాట్లాడుతూ.. తాను హౌస్ నుండి బయటకు రావడం సరైనదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను ఎలిమినేట్ కావాల్సిన వాడినే, దీనిపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదా బాధ లేదు" అని ఓపెన్‌గా ఒప్పుకున్నారు. ప్రేక్షకులు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని చెప్పారు.

బిగ్ బాస్ హౌస్‌లో గడిపిన సమయం జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అద్భుతమైన అనుభవమని వర్ణించారు. హౌస్‌లో బద్ధకంగా తింటూ, నిద్రపోతూ కనిపించాడనే విమర్శలపై స్పందిస్తూ.. హౌస్‌లో ఆహారం చాలా పరిమితంగా ఉండేదని, సరిపడా అల్పాహారం కూడా లభించక కంటెస్టెంట్లు చాలా సాధారణ భోజనంతోనే గడపాల్సి వచ్చేదని లోపలి నిజాలను బయటపెట్టారు.

35
రోజుకు 10 కేజీల స్వీట్లు తినేవాడిని.. సడెన్ బంద్ వల్ల నరకం చూశా

తాను గేమ్‌లో సరిగ్గా రాణించలేకపోవడానికి వెనుక ఉన్న ప్రధాన కారణాన్ని వివరిస్తూ కృష్ణుడు షాకింగ్ విషయాలు చెప్పారు. తనకు బయట ఉన్నప్పుడు రోజుకు ఏకంగా 10 కేజీల స్వీట్లు తినే తీవ్రమైన అలవాటు ఉందని తెలిపారు. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాక గత ఎనిమిది రోజులుగా స్వీట్లు, షుగర్ పూర్తిగా మానేయాల్సి వచ్చిందన్నారు.

ఉన్నట్టుండి ఒక్కసారిగా షుగర్ తీసుకోవడం ఆపేయడంతో శరీరం తీవ్రంగా నీరసించిపోయిందని, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల తాను అనుకున్న స్థాయిలో గేమ్‌పై దృష్టి పెట్టలేకపోయానని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, మెల్లమెల్లగా పంచదార వాడకం తగ్గించాలని హోస్ట్ నాగార్జున తనకు మంచి సలహా ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

45
రోహిత్‌తో బాండింగ్.. శాలిని విషయంలో కృష్ణుడు సీరియస్ వార్నింగ్

హౌస్‌లో రోహిత్‌తో తనకున్న బంధం గురించి కృష్ణుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మొదట్లో తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, రోజులు గడిచేకొద్దీ మంచి స్నేహితులమయ్యామన్నారు. తాను ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తున్న సమయంలో రోహిత్ అచ్చం తన తండ్రి కళ్లే గుర్తుకొస్తున్నాయంటూ కన్నీళ్లు పెట్టుకోవడం తనను తీవ్రంగా కదిలించిందని చెప్పారు. వీరి బంధం బయట కూడా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

రోహిత్‌ను ఒక వ్యూహాత్మక ఆటగాడిగా అభివర్ణించిన కృష్ణుడు, కాలంతో పాటు అతను ప్రశాంతంగా మారాడని మెచ్చుకున్నారు. అయితే అదే సమయంలో.. శాలినితో అతనికి పెరుగుతున్న సంబంధం అతని ఆటను దెబ్బతీస్తుందని, ఏకాగ్రత కోల్పోవద్దని హెచ్చరించారు.

55
సుధీర్ లవ్ ట్రాక్.. ముఖేష్ ఉమెన్ ట్రాక్ విన్నర్

హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్ల పై కృష్ణుడు సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. కంటెస్టెంట్ సుధీర్, సృష్టితో ప్రేమాయణం నెరపడానికి ప్రయత్నిస్తున్నాడని ఓపెన్‌గా కామెంట్ చేశారు. అంతేకాకుండా హౌస్‌లో లేడీస్ అందరితో కలసిపోతున్న ముఖేష్‌ను సరదాగా ఈ సీజన్ "ఉమెన్ ట్రాక్ విన్నర్" అని అభివర్ణించి కొత్త చర్చకు తెరలేపారు.

ఇక స్టేజ్ మీద నాగార్జున కోరినట్లుగా దేబ్జానీ, ఝాన్సీ, సృష్టి, అమన్‌లను పాజిటివ్ వ్యక్తులుగా వర్గీకరించారు. అదే సమయంలో సుధీర్, ముఖేష్, వర్షిణి, చరణ్‌లను నెగిటివ్ వ్యక్తులుగా చెబుతూ.. వారు మనస్ఫూర్తిగా కాకుండా విష్ చేసినా హాఫ్ స్మైల్ మాత్రమే ఇస్తారని విమర్శించారు.

Read more Photos on
click me!

Recommended Stories