
ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ గురించిన కబుర్లే. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ టైమ్ దగ్గరవుతున్న నేపధ్యంలో సినిమా గురించిన విశేషాలు బయిటకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కమల్ హాసన్ (Kamal Haasan) పాత్ర గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో కమల్ విలన్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నిమిత్తం కమల్ ఎంత వసూలు చేసారనే విషయం బయిటకు వచ్చింది.
అయితే కమల్ హాసన్ పాత్ర లెంగ్త్ కి సంబంధించి అభిమానుల్లో ఒకింత గందరగోళం నెలకొంది. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) పార్ట్1 లో కమల్ పాత్ర నిడివి 20 నిమిషాలు మాత్రమే అని సమాచారం అందుతోంది..మొదటి భాగం చివరిలో కమల్ హాసన్ పాత్ర ఎంట్రీ ఉండనున్నట్లు సమాచారం..కమల్ హాసన్ పాత్ర ఎంట్రీతో సినిమా కథ కీలక మలుపు తిరుగనున్నట్లు సమాచారం.
పుష్ప ది రైజ్ (Pushpa: The Rise) క్లైమాక్స్ లో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) రోల్ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చినట్టుగా కల్కి 2898 ఏడీ సినిమాలో కమల్ పాత్ర ఎంట్రీ ఉంటుందని వినపడుతోంది. అలాగే కమల్ పాత్ర విలనిజం ఊహించని స్థాయిలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ అప్ డేడ్ తో ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెరిగిపోయాయి.
అలాగే కల్కి 2898 ఏడీ పార్ట్2 లో కమల్ పాత్ర నిడివి ఏకంగా 90 నిమిషాలు అని సమాచారం అందుతోంది. కల్కిలో కమల్ రోల్ పై ఫుల్ క్లారిటీ ఇదేనంటూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కమల్ తన పాత్రతో విశ్వరూపం చూపిస్తారంటూ అంటున్నారు. కల్కి సినిమాకు కమల్ రోల్ హైలెట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో కల్కి లో నటించిన కమల్ హాసన్ రెమ్యునరేషన్ గూర్చి ఒక ఇంట్రస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ తో అయితే రెండు మూడు సీన్స్ లోనే కనిపిస్తారని తెలుస్తోంది. కానీ ఈ 20 నిమిషాల పాత్రకి కమల్ 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. సెకండ్ పార్ట్ కి ఇంకా ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంది. విశ్వనటుడి రేంజ్ కి ఆ స్దాయి రెమ్యునరేషన్ ఉండాలని అంటున్నారు అభిమానులు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపిక పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ అందరూ నటిస్తున్న ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు నాగ్. 6000 ఏళ్ల నాటి కథ కోసం ఏకంగా కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు గతంలో నాగ్ చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచాయి.
ఈ సినిమా కోసం భారీ సెట్లు, అద్భుతమైన కాస్ట్యూమ్స్, భారీతనం నిండిన సెట్లలో పాటల్ని తెరకెక్కించడంతో విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కల్కి 2898 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించి, పాన్ ఇండియాలో విడుదల చేస్తోంది.
నాగ్ అశ్విన్ రీసెంట్ ఓ మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు. అలాగే మేము ఇక్కడ మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము.
ముఖ్యంగా ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కల్కి తో పాటు రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ చిత్రాలు .. ప్రభాస్ కు క్యూలో ఉన్నాయి.