'మనం' రీరిలీజ్ షోకి హాజరైన చైతు..సమంతతో పెళ్లి సీన్ రాగానే చిరాకు పడ్డ అక్కినేని హీరో, ఫ్యాన్స్ గోల

First Published May 24, 2024, 7:02 AM IST

పదేళ్ల క్రితం అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే. నాగార్జున, ఏఎన్నార్, నాగ చైతన్య కలసి నటించిన ఈ చిత్రం క్లాసిక్ గా నిలిచింది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ పునర్జన్మల తో ప్రేమని మిక్స్ చేస్తూ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పదేళ్ల క్రితం అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే. నాగార్జున, ఏఎన్నార్, నాగ చైతన్య కలసి నటించిన ఈ చిత్రం క్లాసిక్ గా నిలిచింది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ పునర్జన్మల తో ప్రేమని మిక్స్ చేస్తూ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు రీరిలీజ్ అయింది. 

ఈ చిత్రంలో నాగార్జునకి జోడిగా శ్రీయ, నాగ చైతన్యకి జంటగా సమంత నటించారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్. ఈ చిత్రంలో నాగార్జునకి తండ్రిగా నాగ చైతన్య నటించారు. ఏఎన్నార్ కి తండ్రిగా నాగార్జున నటించారు. 

క్లైమాక్స్ లో అఖిల్ కూడా చిన్న కామియో రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాగ చైతన్య దేవి థియేటర్ లో స్పెషల్ షోకి హాజరయ్యారు. ఫ్యాన్స్ ఇప్పటికీ మనం చిత్రాన్ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత మధ్య సన్నివేశాలు వచ్చినప్పుడు స్క్రీన్ దగ్గరకి వెళ్లి మరీ హంగామా చేస్తున్నారు. 

సమంతతో నాగ చైతన్య పెళ్లి సన్నివేశం రాగానే ఫ్యాన్స్ సీట్లలోనుంచి లేచి గంతులేస్తూ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య ముందే ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. పెళ్లి సీన్ కి ఫ్యాన్స్ హంగామా చేస్తుండడంతో చైతు వారిని కూర్చోమని చెబుతూ చిరాకు పడ్డ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

దేవి థియేటర్ కి నాగ చైతన్య వస్తున్నప్పుడు అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. ఈ స్పెషల్ షోకి నాగ చైతన్యతో పాటు డైరెక్టర్ విక్రమ్ కుమార్ కూడా హాజరయ్యారు. 

నాగ చైతన్య, సమంత నటించిన హిట్ చిత్రాల్లో మనం మూవీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ మూవీలో నటించే సమయంలో చై, సామ్ ప్రేమలో ఉన్నారు. 2017లో వివాహం చేసుకున్న చై, సామ్ ఫ్యాన్స్ కి షాకిస్తూ 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. 

click me!