చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు, ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు, బుల్లితెర నటీమణులకు వేధింపుల సంఘటనలు తరచుగా ఎదురవుతూనే ఉన్నాయి. మీటూ ఉద్యమ సమయంలో చాలా మంది నటీమణులు తమకు ఎదురైన సంఘటనలని ధైర్యంగా బయట పెట్టారు. ఇది చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. దీనితో ప్రస్తుతం నటీమణులు తమకి ఎదురైనా చేదు అనుభవాలని సీక్రెట్ గా ఉంచడం లేదు.