రాశి, రంగనాథ్, తాళ్ళూరి రామేశ్వరి, ప్రకాష్ రాజ్ తదితరురు ఇతర ముఖ్యమైన పాత్రను పోషించారు. చిత్రం మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు.భారీ అంచనాల నడుమ 2003 మే 23న రిలీజ్ అయిన ఈసినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది.
అయితే ఈసినిమా మ్యూజికల్ గా మాత్రం ఎంతో హిట్ అయ్యింది. అంతే కాదు ఎన్నో పురస్కారాలను కూడా అందుకుంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్తమ సహాయ నటిగా తాళ్ళూరి రామేశ్వరి నంది అవార్డు కూడా వచ్చింది. ఒక ప్లాప్ సినిమాకు ఇలా అవార్డ్ రావడం చాలా అరుదు అనే చెప్పాలి.