పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి వారసత్వం తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొట్ట మొదటి హీరో. ఆతరువాత తన సోంత ఇమేజ్ తో పవర్ స్టార్ గా ఎదిగాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ ను మించిన అభిమానులను సంపాదించుకుని తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని హీరోగా అవతరించాడు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన.. పంచాయితీ రాజ్ శాఖామంత్రిగా.. గ్రామాల అభివృద్థికోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఆయన.. త్వరలో తన పెండ్డింగ్ సినిమాలు కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
pawan kalyan
ఇక సినిమాలు చేస్తూనే జనసేన పార్టీ స్థాపించి.. దాదాపు దశాబ్ధానికి పైగా ప్రజలమధ్య ఉన్న ఆయన.. ఎన్నో ఆటుపోట్లు.. అవమానాల తరువాత అధికారంలోకి వచ్చారు. కోట్లు సంపాధించే అవకాశం ఉన్నా.. ఆ సమయాన్ని ప్రజలకోసం వినియోగించి.. జనాలకు మంచి చేయాలని పట్టుదలతో శ్రమించారు పవన్ స్టార్.
మెగాస్టార్ ఇమేజ్ తో ఇండస్ట్రీకి వచ్చినా.. పవన్ కళ్యాణ్.. తనదైన ప్రతిభతో హీరోగా నిలదొక్కుకున్నాడు. భారీగా స్టార్డమ్ సంపాదించి అన్నకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు.
టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో పవర్ స్టార్ కూడా ఒకరు. అటువంటి పవన్ కళ్యాణ్ తన తొలి సినిమాకు అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆమధ్య ఆయన ఎన్నికల ప్రచారంలో ఓ మాట అన్నారు.
తాను ప్రస్తుతం సినిమా చేయడానికి రోజుకు2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అంటే దాదాపు పాన్ ఇండియా హీరోలను మించి ఆయన రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. ఇంత స్థాయిలో పారితోషికం అందుకున్న ఆయన.. మొదట్లో మాత్రం చాలా తక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నారు.
pawan kalyan
అసలు డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్న పవన్ కళ్యాణ్ ను..చిరంజీవి భార్య.. పవన్ వదిన సురేఖ హీరోను చేశారు. పవన్ హీరో అవ్వాలని పట్టుపట్టారు. యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుని.. హీరోగా ఏ స్థాయిని ఆయన అందుకున్నారో అందరికి తెలిసిందే. అందుకే పవన్ కళ్యాణ్ సురేఖను మాతృసమానంగా చూస్తారు. ఎంతో ప్రేమగా ఉంటారు.
ఇక 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు పవన్. ఇ. వి. వి. సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ హీరోయిన్ గా నటించింది. హిందీ సినిమాకు రీమేక్ గా వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్ గా ఆడింది.
అల్లు అరవింద్ నిర్మాతగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈసినిమా తెరకెక్కించింది. ఇక ఈమూవీకి పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. అక్షరాల 50 వేలు. ప్రస్తుతం 50 కోట్లకు పైగా అందుకుంటున్న పవన్ మొదటి సినిమాకు కేవలం రూ. 50 వేలు మాత్రమే తీసుకున్నారు.
అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు పవన్ న్ నెలవారీ జీతం అందుకున్నాడు. నెలకు 5 వేలు. అలా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యే సరికి 50 వేల వరకు వచ్చాయట.
ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. పవర్ స్టార్ ఎప్పుడు డబ్బు విషయంలో ఎగిరిపడలేదు. అడిగినవారికి కాదనకుండా సాయం చేస్తూ వచ్చారు. అందుకే అంతమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పవర్ స్టార్.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నా.. తన పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ లైనప్ లో ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీరమల్లు వంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏపీ పాలిటిక్స్ లో పవన్ బిజీ ఉండటం వల్ల ఆ సినిమాల షూటింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇక త్వరలో ఓజీ షూటింగ్ రీస్టార్ట్ కానుందని సమాచారం.