Bigg Boss Telugu 8: గొడవల కోసమే షోకి వచ్చారేంట్రా బాబు, ఫస్ట్ రోజే ఒకరినొకరు కరుచుకుంటున్నారు!

First Published | Sep 2, 2024, 7:03 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ ఒకరిని మించి మరొకరు ఉన్నారు. మొదటి రోజే వివాదాలు, గొడవలు మొదలయ్యాయి. ఎవ్వరూ తగ్గడం లేదు.  
 

Bigg Boss Telugu Season 8

మొదటిరోజే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. కిచెన్ లో మొదలైన చిన్న గొడవ.. పెద్ద వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది. కుకింగ్ విషయంలో.. ప్రెజర్ తీసుకుంటూ.. హౌస్ లో హడావిడి చేస్తోంది కంటెస్టెంట్ సోనియా. వంట విషయంలో నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నారని, తమ వల్ల కాకపోతే.. మేము తీసుకుని చేస్తామంటూ మండిపడింది సోనియా. 

ఈ విషయాన్ని కూల్ గా తీసుకోలేకపోతున్నానంటూ.. హడావిడి చేసింది. ఇక హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కాని ఆమె ఈ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. అయితే సోనియా ఎవరిమీద కోపం చూపిస్తుంది అన్న విషయం మాత్రం తెలియడంలేదు. 

Pic credit: Star Maa youtube channel 

Bigg Boss Telugu Season 8


ఎవరు వంట చేయాలనే విషయంలో ఏకాభిప్రాయం రాలేదు. అందరూ ఒకేసారి మాట్లాడుతుంటే అభయ్ నవీన్.. పిల్ల బచ్చలా బిహేవ్ చేస్తున్నారంటూ.. ఫైర్ అయ్యాడు.  గతంలో ఉన్నకెప్టెన్ వ్యవస్థను తీసేసిన బిగ్ బాస్ దాని స్థానంలో ''చీఫ్'' కాన్సెప్ట్ ను తీసుకు వచ్చారు. ఈక్రమంలో చీఫ్  సెలక్షన్‌పై రచ్చ మొదలయ్యింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం మొదలయ్యింది. మరీ ముఖ్యంగా ఈ విషయంలో  సోనియా, యష్మీ గౌడల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

Pic credit: Star Maa youtube channel 


Bigg Boss Telugu Season 8

కాగా ఇంట్లో ముగ్గురు చీఫ్ లు ఉంటారు. వారి సెలక్షన్ విషయంలో కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పని విషయంలో ఒక పద్దతిగా వెళ్ళాలని బేబక్క ఇచ్చిన సూచనతో చాలామంది విభేదించారు. బేబక్కను విమర్శించడం స్టార్ట్ చేశారు. మీకు ఇల్లు చూసుకోవడం వచ్చా అని బేబక్కను కిర్రాక్ సీత ప్రశ్నించింది. ఇక ఈ విషయంలో నైనిక కలుగచేసుకుని.. ఈ ఫైర్ ను ఇంకాస్త పెంచింది. గొడవను పెద్దది చేసింది. 

Pic credit: Star Maa youtube channel 

Bigg Boss Telugu Season 8

ఈ క్రమంలోనే సోనియా మాటలు మరికాస్త వివాదాన్ని పెంచాయి. యాష్మి గురించి సోనియా చెపుతుండగానే సోనియాను మాట్లాడనివ్వకుండా యాష్మీ ఫైర్ అయ్యింది. ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. మీకెందుకు నా గురించి అంటూ నిలదీసింది. ఈక్రమంలోనే నిఖిల్‌ - అఫ్రీది మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది. 

ఇక ఈ ప్రోమోలో వాడి వేడిగా జరిగింది. చీఫ్ ఎంపిక కోసం జరిగిన ఈ ప్రక్రియ ఎలా జరిగింది.. చివరకు ఎవరు చీఫ్ గా ఎన్నిక అయ్యారు అనేది ఎపిసోడ్ లో తెలుసుకోవాల్సిందే. కాగా బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 1న ముగిసింది. హోస్ట్ నాగార్జున ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా సాగింది. 
 

Pic credit: Star Maa youtube channel 

Bigg Boss Telugu Season 8

హీరో నాని, హీరోయిన్ ప్రియాంక అరుల్, దర్శకుడు అనిల్ రావిపూడి షోలో సందడి చేశారు. కేవలం 14 మంది కంటెస్టెంట్స్ సీజన్ 8లో అడుగుపెట్టారు.  సీరియల్ నటి యాష్మి గౌడ, నటుడు అభయ్ నవీన్, సీరియల్ నటుడు నిఖిల్, ప్రేరణ, నటుడు ఓం ఆదిత్య, సోషల్ మీడియా స్టార్ బేబక్క హౌస్లోకి వచ్చారు. 

Pic credit: Star Maa youtube channel 

Bigg Boss Telugu Season 8

వీరితో పాటు కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, ఆదిత్య ఓం, నటుడు అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, యాష్మి గౌడ, ప్రేరణ, సీరియల్ హీరో నిఖిల్,ప్రేరణ, కిరాక్ సీత, బెజవాడ బేబక్క, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు. అయితే పెద్దగా తెలిసిన ముఖాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురయ్యారు. 

Pic credit: Star Maa youtube channel 

Latest Videos

click me!