చాలా మంది హీరోలు తమ దగ్గరకు వచ్చిన కథలు సూట్ అవ్వవని, లేదా హిట్ అవ్వవని.. లేదంటే ఫలానా హీరో అయితే ఈ కథకు బాగా సూట్ అవుతాడు అని రిజెక్ట్ చేస్తుంటారు. అలాంటి వాటిలో పటాస్, బేబి, గీత గోవిందం, అర్జున్ రెడ్డి లాంటి ఎన్నోసినిమాలు ఉన్నాయి. అవన్నీ ఒక హీరో రిజక్ట్ చేస్తే.. మరో హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవే. అలాంటిదే ఓ సినిమాను ను పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్దంటే.. అది మరో హీరో దగ్గరకు వెళ్లింది.
ఇంతకీ ఆసినిమా ఏదో కాదు.. నువ్వే కావాలి. అవును తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావాలి సినిమా కథ ముందుగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లిందట. కాని ఆయన కుదరదు అనడంతో అది తరుణ్ చేశాడు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నువ్వే కావాలిగా తెరకెక్కించాడు. స్వయంవరం సినిమా తర్వాత విజయ భాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో సినిమా ఇది.
ఇంతకీ ఈ సినిమాను పవన్ ఎందుకు వద్దన్నాడంటే..? పవన్ కళ్యాణ్ కెరీర్ బిగినింగ్ లో మలయాళ మూవీ నీరం ను చేయాలని చూశాడట డైరెక్టర్ ఎస్ జే సూర్య. పవన్ కళ్యాన్, అమీషాపటేల్ జంటా ఈమూవీ రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆతరువాత మళ్ళీ ఆ సినిమాను చేయాలని చూసినా..పవన్ కళ్యాణ్ వద్దన్నారట. ఆ సినిమానే ఆతరువాత తరుణ్ చేసిన నువ్వే కావాలి.
నువ్వే కావాలి (2000): షేర్స్ 19.5 కోట్లు (షేర్స్)
ఈ కథను విజయ్ భాస్కర్ తీసుకుని.. త్రివిక్రమ్ తో కలిసి చేశారు. ఇక ఇది ఎంత పెద్ద హిటో అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా తరుణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇది. తరుణ్ కు భారీగా ఫాలోయింగ్ పెరగడంతో పాటు.. వరుసగా ఆఫర్లు కూడా వచ్చిపడ్డాయి ఈ మూవీతో.
ఈసినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే.. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈమూవీ కోసం కోటిరూపాయల బడ్జెట్ పెడితే.. 35 కోట్లు వసూలు చేసింది సినిమా.. అంతే కాదు కొన్ని థియేటర్లలో 300లకు పైగా ఆడి రికార్డ్ క్రియేట్ సేసింది నువ్వే కావాలి. బెస్ట్ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డు తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా సాధించింది సినిమా.
హీరోయిన్ గాఫస్ట్ సినిమాతోనే రిచ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకుంది. ఇక తరుణ్ అయితే తిరుగులేని క్రేజ్ సాధించాడు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆతరువాత వరుసగా హిట్లు కొట్టాడు.. చిన్న చిన్నగా తరుణ్ క్రేజ్ తగ్గిపోయింది. వరుస ప్లాప్ లు వెంటాడాయి.. ఇక సినిమాలు చేసి లాభం లేదు అనుకున్నాడేమో.. ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటున్నాడు. 40 ప్లస్ అయినా.. ఇంకా పెళ్ళి చేసుకోలేదు ఈ హీరో.