ప్రభాస్ తో సినిమా, ఆ టైంలో మానసికంగా కుంగిపోయా.. రాజమౌళి ఎమోషనల్ కామెంట్స్, అంత బాధకి కారణం..

First Published Jun 28, 2024, 10:25 AM IST

కల్కి దూసుకుపోతున్న వేళ ప్రభాస్ గత చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కి అసలు ఈ స్థాయిలో పాన్ ఇండియా గుర్తింపు రావడానికి ప్రధాన కారణం రాజమౌళి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బాహుబలి తర్వాత అంత పెద్ద విజయం కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి నాగ్ అశ్విన్ కల్కి రూపంలో పండగ చేసుకునే సినిమా ఇచ్చాడు. హాలీవుడ్ స్థాయి టేకింగ్ తో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 

కల్కి దూసుకుపోతున్న వేళ ప్రభాస్ గత చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కి అసలు ఈ స్థాయిలో పాన్ ఇండియా గుర్తింపు రావడానికి ప్రధాన కారణం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం. అప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరూ చేయని ప్రయత్నం రాజమౌళి చేశారు. భారీ మార్కెట్ ఉన్న బాలీవుడ్ వాళ్ళు కూడా ఎలాంటి అటెంప్ట్ చేయలేదు. 

అప్పటికి ప్రభాస్ కి తెలుగులో మార్కెట్ ఉంది కానీ.. హిందీలో లేదు. రాజమౌళి తెలుగు టాప్ డైరెక్టర్ అని తెలుసు కానీ.. ఉత్తరాది ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో తెలియదు. బాహుబలి చిత్రంలో పాన్ ఇండియా గుర్తింపు ఉన్న నటులు అంతగా లేదు. ఇన్ని సవాళ్ల మధ్య రాజమౌళి తనని తాను నమ్ముకుని బాహుబలి చిత్రం ప్రారంభించారు. మొదట 90 కోట్లతో అనుకున్న బాహుబలి చిత్రం రెండు పార్ట్స్ కోసం 250 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. 

2015 జూలైలో బాహుబలి మొదటి భాగం విడుదలయింది. అప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, ఆ సినిమాపై ఉన్న క్రేజ్ తో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా అంటూ నార్త్ లో కూడా ప్రమోషన్స్ చేశారు. 

భారీ అంచనాలతో సినిమా రిలీజ్ అయింది. నార్త్ లో సినిమాకి మంచి టాక్ వచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దారుణమైన టాక్. ఒక వండర్ ని చూడడానికి వెళుతున్నాం అని భావించిన ఆడియన్స్ పూర్తిగా సంతృప్తి చెందలేదు.సెకండ్ హాఫ్ చివరి 40 నిమిషాలు అద్భుతం. కానీ ఫస్ట్ హాఫ్ సోసోగా ఉంటుంది. దీనితో ఆడియన్స్ అనుకున్న స్థాయిలో సినిమా లేదంటూ ప్రచారం చేశారు. 

ఆ ప్రచారం నెమ్మదిగా ఎక్కువై డిజాస్టర్ అనే రేంజ్ కి కూడా నెగిటివ్ టాక్ వెళ్ళింది. తన జీవితంలో బాగా డిప్రెషన్ కి గురైన సందర్భం అదే అని దర్శకధీరుడు రాజమౌళి తెలిపారు. ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా బాహుబలి 1 ని రిలీజ్ చేశాం. అంతా మంచి స్పందన వస్తోంది. కానీ మాకు ప్రధానమైన తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ టాక్ వచ్చింది. 

నా నిర్మాతలు వందల కోట్ల డబ్బు వెచ్చించారు . అంతా ఏమవుతుందో అర్థం కాలేదు. డిప్రెషన్ లోకి వెళ్ళా అని రాజమౌళి అన్నారు. నిజంగానే బాహుబలి 1 డిజాస్టర్ అయితే ఆ తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అని రాజమౌళి అన్నారు. కానీ రాజమౌళి విజన్ ముందు నెగిటివ్ టాక్ పనిచేయలేదు. బాహుబలి చిత్రాన్ని ఒక్కసారైనా చూడాలని ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడ్డారు. 

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్ట్ బాగా వర్కౌట్ అయింది. అది మొదటి భాగానికి కూడా వర్కౌట్ అయింది.. అలాగే సెకండ్ పార్ట్ పబ్లిసిటీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది. కొన్ని రోజుల తర్వాత నెగిటివ్ టాక్ మొత్తం తుడిచిపెట్టుకునిపోయి బాహుబలి 1 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక బాహుబలి 2 విషయంలో ఎలాంటి తడబాటు లేదు. రాజమౌళి స్ట్రైట్ గా కుంభస్థలాన్నే బద్దలు కొట్టారు. 

Latest Videos

click me!