వరాహ రూపం కలిగిన ముఖం ఉండటం వల్ల అమ్మవారికి వారాహి అని పేరు వచ్చింది. చేతిలో నాగలి, దండం, శంఖుచక్రాలతో.. దర్శనం ఇస్తారు మాత, అంతే కాదు ఆమెకు గుర్రం,దున్నపోతు, సింహం వంటి పలు వాహనాలు కలిగి ఉంటుంది అని అంటుంటారు. అయితే వారాహి అమ్మవారి గురించి అందరికి తెలియదు. పురాణాల మీద పట్టుఉన్నవారు...అంతో ఇంతో ఆధ్యాత్మి జ్ఞానం కలిగిన వారికి మాత్రమే అమ్మవారి గురించి తెలుస్తుంది.