ప్రస్తుతం సినిమా, టెలివిజన్ రంగంలో ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణకు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని ప్రొడక్షన్స్ ప్రత్యేకంగా ఇంటిమసీ కోఆర్డినేటర్లను కూడా పెట్టుకుంటున్నారు. నటీనటులు ఏ మేరకు సౌకర్యంగా ఉన్నారు, సన్నివేశంలో ఎలాంటి కదలికలు ఉండాలి, శారీరక స్పర్శకు అనుమతి ఉందా లేదా వంటి అంశాలను ముందుగానే మాట్లాడుకుంటారు.
తెరపై కొన్ని క్షణాల పాటు కనిపించే సన్నివేశం వెనుక ఇంతటి జాగ్రత్తలు ఉంటాయని చాలా మంది ప్రేక్షకులకు సాధారణంగా తెలియదు. కెమెరా యాంగిల్స్, లైటింగ్, ఎడిటింగ్, కొరియోగ్రఫీతో పాటు ఇలాంటి ప్రాక్టికల్ టెక్నిక్స్‌ను ఉపయోగించడం ద్వారా సన్నివేశాలను సహజంగా కనిపించేలా మేకింగ్ చేస్తారు.