Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్

Published : Sep 17, 2026, 04:37 PM IST

సుమ కనకాలపై ప్రముఖ యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో కుల వివక్ష, పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉదయభాను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

PREV
15
Udayabhanu

టాలీవుడ్ లో క్రేజీ యాంకర్స్ లో ఉదయభాను ఒకరు. గ్లామరస్ గా కనిపిస్తూ చలాకీగా మాట్లాడుతూ యాంకర్ గా ఉదయభాను ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే ఇటీవల టాలీవుడ్ లో కొత్త యాంకర్స్ పోటీ వలన ఉదయభాను రేసులో వెనుకబడింది. ఉదయభాను అనేక సినిమాల్లో కూడా నటించారు.

25
నటిగా రాణించిన ఉదయభాను

జులాయి, లీడర్ చిత్రాల్లో ఉదయభాను స్పెషల్ సాంగ్ కూడా చేశారు. ముక్కుసూటిగా మాట్లాడుతూ అనేక వివాదాల్లో కూడా ఉదయభాను చిక్కుకున్నారు. యాంకర్ గా, నటిగా రాణించిన ఉదయభాను రీసెంట్ గా నిర్మాతగా కూడా మారారు. ఆమె నిర్మించిన పంచనామా వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.

35
కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి

తాజాగా ఇంటర్వ్యూలో ఉదయభాను టాలీవుడ్ లో జరుగుతున్న రాజకీయాలు, అవకాశాలు లేకపోవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పీఆర్ హవా నడుస్తోంది. మొదటి ఎవరిని యాంకర్ గా తీసుకుంటే వాళ్లనే కంటిన్యూ చేస్తున్నారు. చిన్న ఇంటర్వ్యూలకు కూడా పెద్ద యాంకర్లు వెళుతున్నారు. నేను చేస్తున్నప్పుడు అలా చేసే దానిని కాదు. చిన్న ఇంటర్వ్యూ ఏదైనా ఉంటే కొత్త అమ్మాయికి ఛాన్స్ వస్తుంది కదా అని నేను పక్కకి తప్పుకునేదాన్ని. నా కెరీర్ లో ఆ రూల్ పెట్టుకున్నా అని ఉదయభాను పేర్కొంది.

45
టాలీవుడ్ లో కష్టాలు

చాలా సార్లు తనకు నంది అవార్డు రాకుండా కులాన్ని దూషించి అడ్డుకున్నారనే విషయాన్ని కూడా ఉదయభాను బయటపెట్టారు. ఇలా తన కెరీర్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు ఉదయభాను పేర్కొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యాంకర్ గా అగ్ర స్థానంలో దూసుకుపోతున్న సుమ కనకాలపై ఉదయభాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

55
యాంకర్ సుమపై షాకింగ్ కామెంట్స్

మీ దృష్టిలో యాంకర్ సుమ అంటే ఏంటి అని అడగగా.. ఆమె వెరీ స్మార్ట్ అని ఉదయభాను సమాధానం ఇచ్చింది. చాలా తెలివైన అమ్మాయి ఆమె. అందుకే ఇంత కాంపిటీషన్ లో కూడా చాలా షోలు చేయగలుగుతోంది. నాకు సుమతో ఎటువంటి శత్రుత్వం, ఎంటువంటి మిత్రుత్వం రెండూ లేవు. కానీ ఆమె చాలా తెలివైన యాంకర్. ఆ తెలివితేటలు అందరికీ ఉండవు. ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్ కదా అంటూ ఉదయభాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories