CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి

Published : Sep 17, 2026, 03:43 PM IST

నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డకు కొత్త బాధ్యత లభించింది. 18 మంది సభ్యులతో పునర్వ్యవస్థీకరించిన సీబీఎఫ్‌సీలో ఆమెకు చోటు దక్కింది.సుప్రియ తో పాటు ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి లాంటి స్టార్స్ పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి.

PREV
15
18 మంది సభ్యులతో కొత్త సీబీఎఫ్‌సీ బోర్డు

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను పునర్వ్యవస్థీకరించింది. మొత్తం 18 మంది సభ్యులతో కొత్త బోర్డును ఏర్పాటు చేయగా, అందులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సుప్రియ యార్లగడ్డకు కూడా చోటు దక్కింది. ఈ నియామకాలు సెప్టెంబర్ 16న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో వెంటనే అమల్లోకి వచ్చాయి. కొత్త బోర్డులో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు స్థానం కల్పించారు. నటులు మనోజ్ జోషి, సునీల్ శెట్టి, ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, పల్లవి జోషి, బెంగాలీ నటుడు ప్రొసెన్‌జిత్ ఛటర్జీతో పాటు దర్శకుడు ప్రియదర్శన్ తదితరులు సభ్యులుగా నియమితులయ్యారు. ఈ బోర్డు పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కొనసాగుతుంది.

25
నాగార్జున మేనకోడలిగా ప్రత్యేక గుర్తింపు

సుప్రియ యార్లగడ్డ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అక్కినేని కుటుంబానికి చెందిన ఆమె నాగార్జున మేనకోడలు. 1996లో పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత నటిగా సినిమాల్లో కొనసాగలేదు.

35
గూఢచారితో రీఎంట్రీ

చాలా కాలం తర్వాత 2018లో అడివి శేష్ నటించిన గూఢచారి సినిమాలో కీలక పాత్రలో కనిపించి నటిగా తిరిగి వచ్చారు. ఆ తర్వాత సినిమాల నిర్మాణం వైపు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి సినీ నిర్మాణం, స్టూడియో వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

45
డెకాయిట్‌తో నిర్మాతగా మరో అడుగు

సుప్రియ యార్లగడ్డ ప్రస్తుతం నిర్మాతగానూ కొనసాగుతున్నారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన డెకాయిట్ సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. షానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పించింది. నిర్మాతగా సుప్రియకు ఈ సినిమా ముఖ్యమైన ప్రాజెక్టుగా నిలిచింది. సినిమాను నిర్మించడం కేవలం ఆర్థిక పెట్టుబడికి సంబంధించిన విషయం కాదని, కథలు, ఆలోచనలను అర్థం చేసుకుని వాటికి సపోర్ట్ ఇవ్వడం కూడా తన నిర్మాణ విధానంలో భాగమని ఆమె గతంలో వెల్లడించారు. డెకాయిట్ తర్వాత కూడా మరిన్ని చిత్రాలను నిర్మించాలనే ఆసక్తితో ఉన్నట్లు ఆమె తెలిపారు.

55
ఇప్పుడు సీబీఎఫ్‌సీ సభ్యురాలిగా కొత్త బాధ్యత

ఇప్పటికే నటిగా, స్టూడియో నిర్వహణలో కీలక బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా, నిర్మాతగా కొనసాగుతున్న సుప్రియ యార్లగడ్డకు ఇప్పుడు మరో ముఖ్యమైన బాధ్యత లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 18 మంది సభ్యుల సీబీఎఫ్‌సీ బోర్డులో ఆమె పేరు అధికారికంగా ఉంది. దీంతో కొత్తగా పునర్వ్యవస్థీకరించిన సీబీఎఫ్‌సీలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె ప్రాతినిధ్యం లభించినట్లయింది. సినిమాల సర్టిఫికేషన్‌కు సంబంధించిన ఈ బోర్డులో సినీ పరిశ్రమకు చెందిన వివిధ రంగాల ప్రముఖులతో కలిసి సుప్రియ కూడా సభ్యురాలిగా వ్యవహరించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories