తెలుగు ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయబోతున్న మరో హాలీవుడ్‌ మూవీ, `క్రావెన్‌ః ది హంటర్‌` వచ్చేది ఎప్పుడంటే?

First Published | Dec 19, 2024, 9:48 AM IST

ఈ వారం `ముఫాసా` తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. మరో పది రోజుల్లో మరో హాలీవుడ్‌ మూవీ మరో ట్రీట్‌ ఇచ్చేందుకు వస్తుంది. అదేంటో చూద్దాం. 
 

సినిమాకి ఇప్పుడు హద్దుల్లేవు. మన తెలుగు సినిమాలు ఇండియా వైడ్‌గానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణపొందుతున్నాయి. తెలుగు మార్కెట్‌ని పెంచుతున్నాయి. అయితే హాలీవుడ్‌ చిత్రాలు కూడా మన ఇండియాలో విశేష ఆదరణ పొందుతున్నాయి. తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తున్నారు.యాక్షన్‌ సినిమాలు, సూపర్‌ హీరో మూవీస్‌, యానిమేషన్‌ చిత్రాలకు ఇక్కడ మంచి ఆదరణ దక్కుతుంది. అందులో భాగంగా మరో సూపర్‌ హిట్‌ సీక్వెల్‌ `ముఫాసాః ది లయన్ కింగ్‌` రేపు శుక్రవారం విడుదల కాబోతుంది. దీంతోపాటు మరో క్రేజీ మూవీ రాబోతుంది. అదే `క్రావెన్‌ ః ది హంటర్‌`. 
 

తెలుగు ఆడియెన్స్ బాగా ఇష్టపడే మైండ్‌ బ్లోయింగ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కడం విశేషం. సోనీ సంస్థ నుంచి వస్తున్న సూపర్‌ హీరో సినిమాల్లో ఇది ప్రముఖంగా ఉంటుంది. జే సీ చాందర్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్, రస్సెల్ క్రౌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ మన ఇండియాలో, తెలుగులో జనవరి 1న న్యూ ఇయర్ ట్రీట్‌గా విడుదల కాబోతుంది. హాలీవుడ్‌లో గత వారం విడుదలై ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చే వారం మన ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 
 


ఈ మూవీ గురించి దర్శకుడు చాందర్‌ మాట్లాడుతూ, ఈ సినిమాకి ఆర్ రేటింగ్ రావడం ఒక వరం గా భావిస్తున్నాను. దీని ద్వారా కథ కి నేను న్యాయం చేయగలను అని అనిపిస్తుంది. క్రావెన్ కథ ని అత్యద్భుతంగా చెప్పడం అవసరం. అందుకే ఈ సినిమా కి ఆర్ రేటింగ్ రావడం శుభ పరిణామంగా  భావిస్తున్నా, కోపం, ఆవేశం తో సెర్గీ ఇద్దరు పిల్లలని టీనేజ్ లో చంపేస్తాడు. ఆ తర్వాత అతను ఈజీగా ఎస్కెప్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అతనలా చేయకుండా ఉన్నాడు. అందుకు కూడా ఒక జస్టిఫికేషన్ ఉంది. చనిపోయిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులు అని అతను భావించడంతో, ఆపుకోలేనటువంటి కోపావేశంతో అతను ఈ భూమి మీద నుంచి ఇద్దరిని చంపేశా అని భావించాడు. ఆ కోపమే ఈ కథ కి ఆయువుపట్టు` అని చెప్పారు.
 

`క్రావెన్: ది హంటర్` సినిమా ఆద్యంత యాక్షన్ ఎలిమెంట్స్ తో అలరిస్తుంది. మార్వెల్ కి సంబందించిన ఒక ఐకానిక్ విలన్ కథ ని మనం ఇందులో చూడొచ్చు. ఆరాన్ టేలర్-జాన్సన్, అతని గ్యాంగ్‌స్టర్‌ తండ్రి నికోలైలో ఉండే పగ, ప్రతీకారం ఈ సినిమా లో చూడొచ్చు. ఈ సినిమా జనవరి 1 న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది. 

read more: చిరంజీవి-ఓదెల మూవీ నుంచి క్రేజీ అప్‌ డేట్‌, మెగా ఫ్యాన్స్ కి ఆ విషయంలో డిజప్పాయింట్‌ తప్పదా?

Latest Videos

click me!