అమీర్ ఖాన్ తో ఓకే చేయించుకున్న తెలుగు దర్శకుడు ఎవరు?

First Published | Dec 19, 2024, 7:29 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రం కోసం ఒక తెలుగు దర్శకుడిని ఎంచుకున్నారు. లాల్ సింగ్ చద్దా తర్వాత కొంత విరామం తీసుకున్న అమీర్ ఖాన్, తిరిగి సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన కథకు ఆసక్తి చూపించారు.

Aamir Khan


గత కొద్ది కాలంగా బాలీవుడ్ చూపు మొత్తం సౌత్ మీదే ఉంది. అక్కడ బాలీవుడ్ స్టార్  హీరోలు ఎక్కువగా మన సౌత్ డైరక్టర్లతో చేయాలని ఉత్సాహపడుతున్నారు. దానికి తోడు రీసెంట్ గా పుష్ప 2 తో సహా అక్కడ పెద్ద తెలుగు సినిమాలు నార్త్ లో  కలెక్షన్స్ తో దుమ్ములేపుతున్నాయి. నార్త్ ఆడియన్స్  కు తగ్గ మేకింగ్ స్టైల్ మనవాళ్లకు ఉందని వాళ్లు ఫిక్సై పోయారు. నార్త్ లో అక్కడ కేవలం మల్టిప్లెక్స్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు దర్శకులు. మన వాళ్లు మాస్ పిల్మ్ లు చేస్తున్నారు. దాంతో బాలీవుడ్ యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోలు దాకా తమిళ, తెలుగు డైరక్టర్ల వైపు చూస్తున్నారు. 


ఈ క్రమంలో ఇప్పటికే షారుఖ్ ఖాన్, అట్లీతో జవాన్ తీయాగా.. సందీప్ రెడ్డి వంగా యానిమాల్ సినిమాతో మన సౌత్  సత్తా ఎంటో చూపించారు. దాంతో ఒక్కొక్కరు మన తెలుగు దర్శకులతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.  తాజాగా మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) సైతం ఓ తెలుగు దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంతకీ అమీర్ ఖాన్ ఆసక్తి చూపుతున్న ఆ డైరక్టర్ మరెవరో కాదు...మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి.  
 



 ఒక టైమ్ లో లగాన్, దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అమీర్ ఖాన్, రెండేళ్ల క్రితం లాల్ సింగ్ చద్దా మూవీ డిజాస్టర్ కావటంతో కొన్నాళ్లుగా సినిమాలకి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు తనను తాను తిరిగి రీలాంచ్ చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా వంశీ పైడిపల్లి చెప్పిన కథకు ఆసక్తి చూపారని సమాచారం. వంశీ పైడిపల్లి గత కొంతకాలంగా ఓ కథను రెడీ చేస్తున్నరు. దిల్ రాజుకు నేరేషన్ ఇవ్వగా..అమీర్ ఖాన్ అయితే ఆ పాత్రకు సెట్ అవుతారని చెప్పారట. దాంతో  అమీర్ ఖాన్ ని కలిసి ఒప్పించే పనిలో ఉన్నాడు.
 

Aamir Khan


  ఎన్టీఆర్ తో బృందావనం, చరణ్ తో ఎవడు, నాగార్జునతో ఊపిరి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వారసుడు తీసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ డైరక్టర్ వంశీ పైడిపల్లి. దిల్ రాజు నిర్మాతగా అమీర్ ఖాన్ తో తెలుగు, హిందీ లలో ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు వినికిడి.  అమీర్ ఖాన్ కి కూడా ఇది మంచి కమ్ బ్యాక్ అవుతుందని, కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కు తోంది అని వినిపిస్తోంది. అన్ని ఓకే అయితే  ఈ లేటెస్ట్ కాంబోపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  

ఇక ఇప్పటి వరుకు డైరక్టర్ వంశీ పైడిపల్లి మన టాలీవుడ్ లో ఆరు సినిమాలు తీశాడు. వాటిలో 5 సినిమాలు దిల్ రాజు బ్యానర్ లోనే రూపొందించడం జరిగింది.  వంశీ పైడిపల్లి తన చివరి సినిమా విజయ్ తో వారసుడు (Varasudu) తెరకెక్కించాడు. ఆ తర్వాత మన తెలుగు స్టార్ హీరోలతో సినిమా ప్లాన్ చేసారు కానీ వారంతా  వేరే ఫ్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఏదీ వర్కవుట్ కాలేదు. అందుకే తన కథని మొదట బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో సినిమా చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే, ఇపుడా ప్రాజెక్ట్ అమీర్ ఖాన్ దగ్గరకు వచ్చిందని చెప్తున్నారు. 

Latest Videos

click me!