మహేష్ బాబు రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్, అట్టర్ ఫ్లాప్ మూవీ గురించి చెప్పి తనపై తానే సెటైర్లు

First Published | Dec 19, 2024, 8:27 AM IST

బాగా క్రేజ్ ఉన్న సినీ తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్నారు. దళపతి విజయ్ కూడా రీసెంట్ గా రాజకీయరంగ ప్రవేశం చేశారు. మహేష్ బాబు కూడా రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది.

టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ లో సమానంగా ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు అని చెప్పొచ్చు. అదే విధంగా మహేష్ కి మహిళా అభిమానుల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. బాగా క్రేజ్ ఉన్న సినీ తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అప్పట్లో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత రాజకీయాల్లోకి వచ్చి రాణించారు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్నారు. దళపతి విజయ్ కూడా రీసెంట్ గా రాజకీయరంగ ప్రవేశం చేశారు. మహేష్ బాబు కూడా రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి చిత్రాలు రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారా అనే చర్చ కూడా జరిగింది. 


ఎప్పటికప్పుడు మహేష్ బాబు రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని చెబుతూనే ఉన్నారు. కానీ మీడియా నుంచి మాత్రం మహేష్ కి రాజకీయ పరమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి వస్తున్నారు. మీకు పాలిటిక్స్ లోకి వెళ్లే ఆలోచన ఉందా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. నన్ను ఎవరైనా పాలిటిక్స్ లోకి తీసుకువెళితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నాకు రాజకీయాల గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు అని మహేష్ బాబు అన్నారు. 

కానీ కథని బట్టి పొలిటికల్ మూవీస్ మాత్రం చేస్తుంటాను అని మహేష్ బాబు అన్నారు. మరో మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ.. మీరు సైనికుడు చిత్రంలో కూడా యువత రాజకీయాల్లోకి రావాలని మెసేజ్ ఇచ్చారు. కాబట్టి పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన మీరు చేయడం లేదా అని అడిగారు. మహేష్ బదులిస్తూ.. అందుకే ఆ సినిమా ఒక్క వారం మాత్రమే ఆడింది అంటూ తనపైన తానే సెటైర్లు వేసుకున్నారు. 

మహేష్ బాబు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నటించిన భరత్ అనే నేను చిత్రం మాత్రం ఘనవిజయం సాధించింది. యంగ్ సీఎం పాత్రలో మహేష్ బాబు అదరగొట్టారు. మహేష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన సైనికుడు చిత్రం మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. 

Latest Videos

click me!