కానీ హిమ మాత్రం బాధ పడుతూ ఎలా అయిన సౌర్య,నిరుపమ్(Nirupam)ని కలపాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తరువాత దుర్గ జ్వాలా ఆటో కి బొట్టు పెట్టి పూజలు చేస్తూ ఉంటాడు. మరొకవైపు నిరుపమ్, హిమ(hima) గుడిలో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. నిరుపమ్ పెళ్లి ఫిక్స్ అయినందుకు అమ్మవారికి ముడుపు కడతాను అని అనగా, అప్పుడు వెంటనే హిమ నీకు,జ్వాలా కి పెళ్లి జరగాలని నేను ముడుపు కడతాను అనడంతో నిరుపమ్ షాక్ అవుతాడు. రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ ముడుపులు కడుతూ ఉండగా అది చూసిన జ్వాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.