సెలబ్రిటీలకు, సినీ అభిమానులకు బుధవారం ఉదయం ఊహించని షాకింగ్ న్యూస్ ఎదురైంది. కరోనా మహమ్మారి ప్రభావం నటి మీనా కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్(48) మృతి చెందారు. గత కొంతకాలంగా చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రులో విద్యా సాగర్ చికిత్స పొందుతున్నారు.