Karthik Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మరీ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇక చాటుగా ఉండి సౌర్య (Sourya) మాటలు విన్న హిమ ఇంకా నీ కోపం తగ్గలేదా సౌర్య అని మనసులో అనుకోని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక హిమ (Hima) ఎందుకు వెళుతుందో సౌర్య కు ఏ మాత్రం అర్థం కాదు. ఇక ఇంటికి వెళ్ళిన హిమ వాళ్ల తల్లిదండ్రులు ఫోటోలు చూసుకుంటూ సౌర్య దొరికింది డాడీ అంటూ ఆనందంగా ఏడుస్తుంది.
26
అదే క్రమంలో హిమ (Hima) మీ చావుకు నేనే కారణం అయ్యాను డాడీ అని అంటుంది. ఇక హిమ మనసులో నామీద కోపం తీసేయ్యడమే నా లక్ష్యం డాడీ అని ఏడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మేమిద్దరం ఎప్పటిలాగా కలిసుండాలని దీవించండి అని దీవించండి అని కార్తీక్ (Karthik) దీపల ఫోటోల వైపు చూస్తూ అడుగుతుంది.
36
ఇక తన కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసాను తన మార్పు కోసం ఎదురు చూడ లేనా అని హిమ (Hima) అనుకుంటుంది. మరోవైపు ఆనందరావ్ (Anand rao), సౌర్య లు స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్లగా సౌందర్య ను లోపలకి రావొద్దని స్వప్న ముఖం మీద చెప్పేస్తుంది.
46
ఇక అదే క్రమంలో నిరూపమ్ (Nirupam) వాళ్ల నానమ్మ తరపున మాట్లాడుతూ ఉండగా అంతగా నీకు చూడాలనిపిస్తే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి చూసి రా అని అంటుంది. మరోవైపు జ్వాలా (Jwala) ఇంటికి హిమ వెళ్లి నిన్ను చూడాలని పించింది వచ్చాను అని అంటుంది.
56
ఇక హిమ (Hima) ను ఇంద్రుడు చంద్రమ్మలు నీ పేరు ఏంటమ్మా అని అడుగుతారు. ఇక దాంతో హిమ పేరు చెప్పడానికి కొంత సందేహాస్తుంది. ఇక సౌర్య (Sourya) కూడా నీ పేరు ఏంటో చెప్పు అని అడుగుతుంది. దాంతో హిమ సౌర్య చేతిని ప్రేమగా పట్టుకుంటుంది.
66
ఇక తరువాయి భాగంలో ఫ్యామిలీ మొత్తం భోజనం చేయడానికి కూర్చుంటారు. ఈ క్రమంలో సౌర్య (Sourya) తింగరి నీకు ఏ కూర ఇష్టం అని అడుగుతుంది. దాంతో హిమ (Hima) దోసకాయ పచ్చడి అని అంటుంది. ఇక సౌర్య ఒక్క సారిగా కోపం పడుతుంది. ఆ తర్వాత హిమకు పోర పోయినట్లుగా ఉండగా సౌర్య నీళ్లు తాగిస్తుంది.