విల్ స్మిత్ పై మోషన్స్ పిక్చర్ అకాడమీ చర్యలు తీసుకుంది. ఆస్కార్ తో పాటు, ఏ ఇతర అకాడమీ అవార్డ్స్ లో కూడా పాల్గొనకుండా పదేళ్ళపాటు నిశేదాన్ని విధించింది. విల్ స్మిత్ చర్యను ఖండించిన మోషన్ పిక్చర్ అకాడమీ.. ఈ విషయంలో విచారణ చేపట్టింది. శుక్రవారం బోర్డ్ గవర్నర్లు సమావేశం అయ్యారు. ఈ విషయం గురించి విచారణ జరిపారు. విల్మ్ స్మిత్ చేసింది ముమ్మాటికీ తప్పే అంటూ అతనిపై చర్యలకు ఆదేశించారు. ఏప్రిల్ 8 నుంచి పదేళ్ల పాటు విల్ స్మిత్ పై నిషేధం విధించారు.