సౌందర్య సీరియస్ అవుతూ కోపాలు, పగలు అన్ని సహజమే.. కానీ బంధలు సహజం. అమ్మానాన్నలను పోగొట్టుకున్న నువ్వే అంత ఫీల్ అవుతే నా కొడుకు, కోడలు పోయారు.. నేను ఎంత బాధ పడాలి అని సీరీయస్ అవుతుంది. ఇప్పుడైనా మా కళ్ళ ముందు ఉండు అమ్మ అని ఆనంద్ రావు అంటే కూడా వినకుండా వెళ్తే అప్పుడు అతను కార్తీక్, దీప ఫోటోలు చూపిస్తూ కన్నీళ్లు పెడుతాడు. ఆనంద్ రావు మాటలు విన్నపుడు శౌర్య కాస్త మారి ఇక్కడే ఉంటాను అని మాట ఇస్తుంది.