కేరళాకి అల్లు అర్జున్‌ సాయం చేయడానికి కారణమేంటో తెలుసా? రష్మిక మందన్నా, నాగవంశీ ఎంత డొనేట్‌ చేశారంటే?

Published : Aug 04, 2024, 01:51 PM IST

కేరళా రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా నష్టం ఏర్పడింది. దీంతో కేరళా కోసం తెలుగు స్టార్స్ నిలబడ్డారు. భారీగా ఆర్థికసాయం ప్రకటించడం విశేషం. 

PREV
15
కేరళాకి అల్లు అర్జున్‌ సాయం చేయడానికి కారణమేంటో తెలుసా? రష్మిక మందన్నా, నాగవంశీ ఎంత డొనేట్‌ చేశారంటే?

 భారీ వర్షాలు, వరదలు కేరళా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా వాయనాడ్‌ ప్రాంతంలో నీట మునిగిపోయింది. కొండిచరియలు విరిగిపటంతో, భారీగా వరదల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 200 మంది విగతజీవులుగా మారినట్టు తెలుస్తుంది. కేరళా వాయనాడ్‌ కోసం ఎంతో మంది ప్రార్థిస్తున్నారు. కేరళా ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంది. మరోవైపు ప్రముఖులంతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

25

ఇక సినీ ప్రముఖులు స్పందిస్తూ తమవంతు సాయాన్ని అందిస్తున్నారు. కేరళా సినీ స్టార్స్ సీఎం సహాయ నిధికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. మమ్ముట్టి 20 లక్షలు, దుల్కర్‌ సల్మాన్‌ 15 లక్షలు ప్రకటించారు. ఫహద్‌ ఫాజిల్‌-నజ్రియా రూ.25లక్షలు ప్రకటించారు. అలాగే సూర్య, జ్యోతిక, కార్తి రూ.50లక్షలు ప్రకటించగా, విక్రమ్ రూ.20లక్షలు సాయం ప్రకటించారు. 
 

35
rashmika

వీరితోపాటు రష్మిక మందన్నా స్పందించింది పది లక్షలు ఆర్థిక సాయం స్పందించింది. ఆమె ఇప్పటి వరకు మలయాళ సినిమాలు చేయలేదు. కానీ కేరళా కోసం తనవంతుగా సాయం ప్రకటించడం విశేషం. కారణం అక్కడి ఆడియెన్స్ ఆమెని ఆదరించడమే. అలాగే నిర్మాత నాగవంశీ సైతం స్పందించి సాయం ప్రకటించారు. ఐదు లక్షలు డొనేట్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఆయన ప్రస్తుతం దుల్కర్‌ సల్మాన్‌తో `లక్కీ భాస్కర్‌` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వచ్చే నెలలో విడుదల కాబోతుంది.

45
Allu Arjun

ఇక తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సైతం విరాళం ప్రకటించారు. ఆయన ఏకంగా రూ. 25లక్షలు కేరళా కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి సాయం ప్రకటించడం విశేషం. టాలీవుడ్‌లో హీరోల్లు కేరళా కోసం ఆర్థిక సాయం ప్రకటించిన తొలి హీరో అల్లు అర్జున్‌ కావడం విశేషం. అయితే బన్నీ మాత్రమే ప్రకటించడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. కేరళా ఆడియెన్స్ బన్నీని సొంత హీరోగా భావిస్తారు. ఆయన డాన్సులకు అక్కడ చాలా క్రేజ్‌ ఉంది. మల్లూ స్టార్‌గా భావిస్తూ ఆదరిస్తుంటారు. బన్నీ సినిమాలు కూడా కేరళాలో మిగిలిన చిత్రాల కంటే బెటర్‌ కలెక్షన్లు వస్తాయి. అల్లు అర్జున్‌ కూడా తనకు తెలుగు తర్వాత, మాలీవుడ్‌ని మరో హోమ్‌ ఇండస్ట్రీగా భావిస్తుంటారు. ఇలా కేరళా ప్రజలకు, బన్నీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే ఆయన వెంటనే తనవంతుగా విరాళ ప్రకటించడం విశేషం. 
 

55

ప్రస్తుతం బన్నీ `పుష్ప2` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో ఫహద్‌ పాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 6న విడుదల కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories