డింపుల్‌ హయతికి షాక్ ఇచ్చిన కోర్టు.. విచారణకు రావల్సిందే అంటూ నోటీసులు

First Published Jun 8, 2023, 11:59 AM IST

అతిగా ప్రవర్తించిన కారణంగా చిక్కుల్లో పడింది హీరోయిన్ డింపుల్ హయతి. అంతే కాదు కోర్టుకు వెళ్లి మరీ మొట్టికాయలు తినక తప్పలేదు హీరోయిన్ కు. 
 

డింపుల్ హయతీ.. టాలీవుడ్ తో పాటు.. హిందీ, తమిళ్ లో కూడా అడపా దడపా సినిమాలు చేసుకుంటూ.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. కాని ఇప్పటి వరకూ తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం పడలేదు. దాంతో టాలీవుడ్ లో చేపపిల్లలా.. సక్సెస్ కోసం కొట్టుమిట్టాడుతోంది. 

తాజాగా రామబాణం సినిమాతో లక్కు ను పరీక్షించుకుంది బ్యూటీ. కాని గోపీచంద్ సరసన నటించినా కూడా ఆమెను సక్సెస్ వరించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి అందాలు ప్రదర్శిస్తోంది బ్యూటీ. ఏదో ఒక రోపు లక్కు కలిసి రాకపోతుందా అని చూస్తోంది. ఈక్రమంలో ఆమె తాజాగా ఓవివాదంలో చిక్కుకుంది. 

పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలను ఎదురొంటున్న  డింపుల్‌ హయతి తో పాటు లాయర్ విక్టర్‌ డేవిడ్‌ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు వారిద్దరికీ సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేయాలని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. 
 

ఇంతకీ అసలు సంగతి ఏంటంటే...హైదరాబాద్ లో ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్న డింపుల్.. అదేఅపార్ట్మెంట్ లో ఉంటున్న పోలీస్ ఆఫీసర్ కారుకు అడ్డంగా తన కారును పార్క్ చేయడంతో పాటు.. ఆకారుకు డాష్ ఇచ్చి.. డ్యామేజ్ చేసింది. అంతే కాదు ఆఫీసర్ తో గొడవకు దిగి.. రకరకాలుగా దుర్భాషలాడినట్టు సమాచారం. 
 


దాంతో ఆమె విషయంలో రెండు మూడు సార్లు చూసీ చూడనట్టు ఉన్న ఆఫీసర్.. ఆతరువాత డింపుల్ పై కేసు నమోదు చేశారు. దాంతో తనపై గత నెల 17న జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ డింపుల్ హైకోర్ట్ ను ఆశ్రయించింది. ఇక ఆమె  దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ జీ అనుపమా చక్రవర్తి విచారణ చేపట్టారు.
 

పిటిషనర్లపై అసత్య అభియోగాలు నమోదు చేశారని, పోలీసులు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ట్రాఫిక్‌ డీసీపీ ప్రోద్బలంతోనే ఆయన కారు డ్రైవర్‌ చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. 

ఏపీపీ గణేశ్‌ వాదిస్తూ, నటి డిపుల్‌ హయతికి పోలీసులు 41ఎ నోటీసులు జారీ చేశారని చెప్పారు. కారును ధ్వంసం చేసినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. వాదనల అనంతరం న్యాయమూర్తి డింపును విచారణకు హాజరు కావాల్సిందే అని ఫైనల్ తీర్పు ఇచ్చారు. 

click me!