ఇప్పటికే ఆదిపురుష్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు.. దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఉత్కంటతో ఎదరుచూస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది ఆదిపురుష్. రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసన్ సందడి చేయబోతున్నారు. ఇక ఆదిపురుష్ రిలీజ్ కంటే ముందే.. మరో రామాయణానికి సబంధించి మరో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈమూవీలో సీతగా సాయి పల్లవి సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.