Ennenno Janmala Bandham: మాళవిక కొత్త ప్లాన్.. ఇక వేద కాపురం ముక్కలైనట్లేనా?

First Published Jun 8, 2023, 11:47 AM IST

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ కథనాలతో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. కూతురి మంచితనం వల్ల కూతురు జీవితం ఎక్కడ పాడైపోతుందో అని భయపడుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

 ఎపిసోడ్ ప్రారంభంలో వేద అన్న మాటలు తలుచుకొని బాధపడుతుంది సులోచన. భర్త సర్ది చెప్పడానికి చూస్తే అతని మీద కూడా కేకలు వేస్తుంది. అంతలోనే అక్కడికి వచ్చిన వేద నేను అలా మాట్లాడటం తప్పే కానీ నిన్ను ఆపడానికి అంతకుమించి వేరే దారి దొరకలేదు క్షమించు అంటూ చెవులు పట్టుకుంటుంది. నా భయం నీకు అర్థం కావడం లేదు నా కూతురు కాపురం ఏమైపోతుందో అని భయపడుతున్నాను అంటుంది సులోచన.
 

ఇందులో భయపడటానికి ఏముంది చెత్త కుప్పల పాలైన మనిషిని అలాగే వదిలేసి వచ్చేయలేము కదా నువ్వు నాకు అలాంటి సంస్కారాన్ని నేర్పించలేదు. నువ్వు మాళవిక ని మాత్రమే చూస్తున్నావు కానీ నేను ఆ కొంగు పట్టుకుని నిలబడిన ఆదిత్యని చూస్తున్నాను  అని తల్లికి సర్ది చెప్తుంది వేద. కానీ కోపాన్ని కంట్రోల్ తీసుకోలేని సులోచన టీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్తుంది.
 

మరోవైపు తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బ్రతకడం కష్టమని భావించిన మాళవిక ఎలాగైనా వేదనే ఆ ఇంట్లోంచి తరిమేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇన్ని తప్పులు చేసినప్పటికీ నన్ను ఇంట్లో పెట్టుకున్నారంటే అందుకు కారణం ఆదిత్య. నేను లేకపోతే ఆ ఆదిత్య ఇంట్లో ఉండడు అని పరోక్షంగా తెలియజేయాలి అలా చేయాలి అంటే ఆదిత్య మనసు మార్చాలి అని మనసులో అనుకుంటుంది మాళవిక.

మరోవైపు కిచెన్ లోకి వెళ్లిన తల్లి వెనకాలే వెళ్తుంది వేద. తల్లికి సర్ది చెప్పటానికి చూస్తుంది. సులోచన మాత్రం భయంతోనే ఉంటుంది. ఆ మాళవిక సంగతి నీకు తెలిసిందే కదా ఎంతైనా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు వాళ్లకి ఇద్దరు పిల్లలు. ఈరోజు కాకపోతే రేపైనా ఆ ఇంట్లో నువ్వు పరాయిదానివి అయిపోతావు. ఆ మాత్రం గ్రహించలేకపోతున్నావా అంటూ కూతుర్ని మందలిస్తుంది. తండ్రి కూడా అదే చెప్తాడు.
 

నీ భర్త మాజీ భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారో అంటూ తన మనసులో మాట బయటపెడతాడు శర్మ. మాళవిక సంగతి పక్కన పెట్టు నాది నా భర్తది అంతా తొందరగా విడిపోయే బంధం కాదు. ఆయనకి నేనంటే ప్రాణం. ఆదిత్య ఇంట్లోకి వచ్చేసరికి నా భర్త, అత్తగారి ముఖాలు ఎలా వెలిగిపోయాయో చూసావు కదా.
 

ఎప్పుడో వచ్చే కష్టాల గురించే ఆలోచిస్తూ ఇప్పుడు ఉన్న సంతోషాలని వదులుకోలేనంటూ తల్లి పెట్టిన కాపీ తాగుతూ కాఫీ చాలా బాగుంది అలాగే నీ కూతురు కాపురం కూడా బాగుంటుంది నా గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది వేద. దీని మంచితనమే ఎప్పుడో ఒకప్పుడు దాని కొంప ముంచుతుంది అని భయపడుతుంది సులోచన.
 

మరోవైపు ఇంట్లో వేదకి ఉండడానికి ఉన్న అర్హతలేమిటి, నాకు లేని అర్హతలేమిటి అని  అనుకుంటుంది మాళవిక. తనకి పిల్లలు లేరు నాకు పిల్లలు ఉన్నారు. నేను చాలా సంవత్సరాలు సంసారం చేశాను ఎలా చూసిన ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు మాత్రమే ఉంది. ఎలా అయినా వేదని ఈ ఇంట్లోంచి పంపించి పరిస్థితులని తీసుకురావాలి అనుకుంటుంది మాళవిక.మరోవైపు వసంత్ ఫోన్ చేసి హోటల్ రూమ్ బుక్ చేశాను కదా ఏమైంది అని అడుగుతాడు. యష్ మాట్లాడలేక ఇదిగో మీ వదిన వచ్చింది తననే అడుగు అని ఫోన్ ఇచ్చేస్తాడు. 

వసంత్ వేద తో మాట్లాడటానికి ఇబ్బంది పడి ఫోన్ చిత్ర కి ఇచ్చేస్తాడు. వేద చిత్ర తో మాట్లాడి వచ్చేటప్పుడు గుడ్ న్యూస్ తో రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వాళ్ళకే గుడ్ న్యూస్ చెప్పమంటున్నావు కానీ నాకు ఏమీ గుడ్ న్యూస్ చెప్పవు అంటాడు యష్. మీకు ఏం కావాలి అంటుంది వేద. ముద్దు కావాలి అంటాడు యష్. ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అని వేద అంటే ఆమెని చొరవగా దగ్గరికి తీసుకుంటాడు యష్. వాళ్ళిద్దరూ అలా సరదాగా ఉండడానికి చూసి భరించలేక పోతుంది మాళవిక. తన గదిలోకి వెళ్లి తనని మోసం చేసినందుకు అభిని తిట్టుకుంటుంది. నేను వదిలేసిన వాడు సుఖంగా ఉంటే చూడలేకపోతున్నాను అంటూ మళ్లీ మందు తాగుతుంది.

అది చూసిన ఆదిత్య తల్లి దగ్గరికి వచ్చి తాగొద్దు అని బ్రతిమిలాడుకుంటాడు. తాగకుండా ఉండలేకపోతున్నాను నా పరిస్థితి దారుణంగా ఉందని ఏడుస్తుంది మాళవిక. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

click me!