చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ప్రగ్యా ఉనికి కోల్పోయింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది. టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యాకు కాలం కలిసి రాలేదు.