కామెడీ షోలోకి రీఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్... ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ!

Published : Dec 20, 2023, 01:54 PM IST

సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఇది. ఆయన హీరోగా సినిమాలు చేస్తూనే కామెడీ షోలో సందడి చేయనున్నాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతుంది.

PREV
17
కామెడీ షోలోకి రీఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్... ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ!
Sudigali Sudheer


సుడిగాలి సుధీర్ హీరోగా రాణిస్తున్నాడు. మొదటి హిట్ కూడా కొట్టేశాడు. గత ఏడాది సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. సుడిగాలి సుధీర్ మార్కెట్ చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోయారు. మనోడికి ఇంత రేంజ్ ఉందా, అని షాక్ అయ్యారు. 
 

27
Sudigali Sudheer

దీంతో నిర్మాతలకు సుధీర్ తో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కాలింగ్ సహస్ర తో ప్రేక్షకులను పలకరించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కాలింగ్ సహస్ర అంతగా జనాలకు రీచ్ కాలేదు. నిజానికి కాలింగ్ సహస్ర ఆగిపోయిన సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు. 

37
Sudigali Sudheer

ప్రస్తుతం G O A T టైటిల్ తో సుడిగాలి సుధీర్ ఒక చిత్రం చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉన్నట్లు సమాచారం. షూటింగ్స్ తో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్ ఓ కామెడీ షోలో సందడి చేశాడు. అతడు రీ ఎంట్రీ ఇచ్చాడు. 

 

47
Sudigali Sudheer

తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో కామెడీ ఎక్స్ఛేంజ్ పేరుతో కామెడీ షో స్ట్రీమ్ అవుతుంది. ఇది సీజన్ 2. దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ముక్కు అవినాష్, సద్దాం, రోహిణి, యాదమ్మ రాజుతో పాటు మరికొందరు బుల్లితెర కమెడియన్స్ స్కిట్స్ చేస్తున్నారు. 

57
Sudigali Sudheer

కామెడీ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2లో సుడిగాలి సుధీర్ తళుక్కున మెరిశాడు. అతడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అనిల్ రావిపూడి మాత్రం పంచ్ విసిరాడు. హగ్ ఇవ్వబోతున్న సుడిగాలి సుధీర్... దూరంపో దగ్గరగా చూస్తే బొక్కలా ఉన్నావ్, అని సెటైర్ వేశాడు. షాక్ కావడం సుడిగాలి సుధీర్ వంతు అయ్యింది. 

67
Sudigali Sudheer

కామెడీ ఎక్స్ ఛేంజ్ సీజన్ 1 కి సుధీర్, దీపికా పిల్లి యాంకర్స్ గా వ్యవహరించారు. అనిల్ రావిపూడి అప్పుడు కూడా జడ్జిగా ఉన్నారు. సీజన్ 2 నుండి దీపికా పిల్లి తప్పుకుంది. సుడిగాలి సుధీర్ తాజాగా ఎంట్రీ ఇచ్చాడు. మరి కేవలం ఒక ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చాడా లేక ఇకపై కొనసాగుతాడా అనేది చూడాలి... 

 

77

జబర్దస్త్, ఢీ షో వేదికగా సుడిగాలి సుధీర్ ఏళ్ల తరబడి ఎంటర్టైన్మెంట్ పంచాడు. బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ తో సుధీర్ కి విబేధాలు తలెత్తాయని సమాచారం. అందుకే ఈటీవికి సుధీర్ పూర్తిగా దూరమయ్యాడు. బుల్లితెర ఆడియన్స్ ఆయన్ని చాలా మిస్ అవుతున్నారు... 

click me!

Recommended Stories