దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న తమన్నా... ఓటీటీలో వరుసగా సినిమాలు!

Published : Sep 30, 2022, 04:00 PM IST

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పెద్దలు చెప్పిన సత్యం. ఈ సూక్తిని హీరోయిన్ తమన్నా బాగా ఒంటబట్టించుకున్నారు. అంది వచ్చిన అవకాశాలను కాదనకుండా సినిమాలు చేసుకుంటూపోతుంది.

PREV
16
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న తమన్నా... ఓటీటీలో వరుసగా సినిమాలు!
Tamannah Bhatia


తమన్నా కొత్త సినిమాలు ఎప్పుడు ప్రకటిస్తున్నారో వాటిని ఎప్పుడు పూర్తి చేసి విడుదల చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. వారం వ్యవధిలో ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. బహుశా చాలా మందికి ఆ విషయం తెలియకపోవచ్చు. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. 

26

కారణం తమన్నా విడుదల చేసిన రెండు బాలీవుడ్ చిత్రాలు. హిందీలో విడుదలయ్యాయి. అలాగే అవి నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి చిత్రాలు వారం గ్యాప్ లో విడుదలయ్యాయి. 
 

36
Tamannah Bhatia

బబ్లీ బౌన్సర్ హోస్ట్ స్టార్ లో విడుదలైంది. సెప్టెంబర్ 23 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇక నేడు అనగా సెప్టెంబర్ 30న ప్లాన్ ఏ ప్లాన్ బి చిత్రం నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ మూవీలో తమన్నాకు జంటగా  దేశ్ ముఖ్ నటించారు. ఇక ఓటీటీ లో విడుదలయ్యే చిత్రాల జయాపజయాల గురించి పెద్దగా ఎవరూ చప్పుకోరు. బాగుంది అంటే చూస్తారు, లేదంటే పక్కన పెట్టేస్తారు. 
 

46

స్టార్ గా హైట్స్ చూసిన తమన్నా కెరీర్ చివర్లో కంటెంట్, స్టార్ డమ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది. నెలల వ్యవధిలో సినిమాలు పూర్తి చేసి కోట్లు ఆర్జిస్తోంది. స్టార్ హీరోలో ఆఫర్ వచ్చినా పూర్తి కావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. అదే లేడీ ఓరియెంటెడ్ మూవీ అయితే ఏడాదికి రెండు విడుదల చేయవచ్చు. 

56

తమన్నా ఇప్పుడు అదే చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా ఖాతాలో చిరంజీవి భోళా శంకర్, సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం చిత్రాలు ఉన్నాయి. అలాగే బోల్ చుడీయా టైటిల్ తో మరో హిందీ చిత్రం చేస్తున్నారు. ఆ మధ్య మ్యాస్ట్రో మూవీలో తమన్నా బోల్డ్ రోల్ చేశారు. ఆ పాత్ర కోసం ఆమె భారీగానే రాబట్టారు.

66
Tamannah


32 ఏళ్ల తమన్నా పెళ్లి మాటెత్తడం లేదు. తన తోటి హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు కూడా తల్లయ్యింది. 15 ఏళ్లుగా చిత్రాలు చేస్తున్నా ఆమెకు విసుగు రాలేదు. వయసు, కోరికలు ఆవిరి కాకముందే పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. మరి తమన్నా ఇంకెన్నాళ్లు ఒంటరిగా ఉంటుందో చూడాలి.  

click me!

Recommended Stories