అసలు ఆ బట్టలు వేసుకోవడం ఏంటి ?.. 'సీతా రామం' హీరోయిన్ బోల్డ్ లుక్ పై ట్రోలింగ్..

First Published Sep 30, 2022, 3:49 PM IST

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. 

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. 

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. 

రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. 

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీతా రామం చిత్రంలో మృణాల్ ఠాకూర్ సంప్రదాయ వస్త్రధారణలో అదరగొట్టేసింది. నెటిజన్లు కూడా ఆమెని ముద్దుగా సీత అని పిలుస్తున్నారు. 

తాజాగా మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ కి షాకిస్తూ వెస్ట్రన్ వేర్ లో బోల్డ్ ఫోజులు ఇచ్చింది. సీతగా మృణాల్ ని అలా చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు వెస్ట్రన్ ఫోజుల్లో జీర్జించుకోలేకున్నారు. 

బ్రాని తలపించే ఒక డిజైన్ ఉన్న డ్రెస్ దానిపై లాంగ్ కోట్ తో మృణాల్ ఠాకూర్ ఘాటైన ఫోజులు ఇస్తోంది. ఎద సోయగాలు ఘాటుగా చూపిస్తోంది. మెడలో ఆకర్షించే దండని ధరించింది. 

మృణాల్ ఇలా బోల్డ్ ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు.. ఏంటి సీతా ఇది.. ఆ బట్టలు వేసుకోవడం ఏంటి?.. ఇలా అయ్యావు ఏంటి.. అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ లుక్ డిసప్పాయింట్  గా ఉందని అంటున్నారు. 

click me!