మురళీ మోహన్ భార్య కావాల్సిన శ్రీదేవి, బోనీ కపూర్ ని ఎందుకు చేసుకుంది... ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు తెలుసా? 

Published : Mar 11, 2024, 10:39 AM IST

వెండితెరపై శ్రీదేవి ఒక సంచలనం. ఈ తమిళ అమ్మాయి ఇండియా మొత్తం ఫేమ్ రాబట్టింది. అయితే శ్రీదేవి నటుడు మురళీ మోహన్ భార్య కావాల్సిందట.  మరి ఆమె బోనీ కపూర్ ని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది.   

PREV
15
మురళీ మోహన్ భార్య కావాల్సిన శ్రీదేవి, బోనీ కపూర్ ని ఎందుకు చేసుకుంది... ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకు తెలుసా? 

శ్రీదేవి బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం హీరోయిన్ గా మారింది. అనతి కాలంలో శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళ్, తెలుగు భాషల్లో బిజీ యాక్ట్రెస్ అయ్యింది. బాలీవుడ్ కి వెళ్లి సక్సెస్ అయిన ఫస్ట్ సౌత్ హీరోయిన్. లోకల్ హీరోయిన్స్ కి కూడా షాక్ ఇచ్చింది. 

25

అలాంటి శ్రీదేవి నటుడు మురళీ మోహన్ భార్య కావాల్సిందట. మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆ కథ ఏమిటో స్వయంగా చెప్పుకొచ్చాడు. మురళీ మోహన్ వ్యాపారం చేస్తూ ఉండేవాడట. మిత్రులు, సన్నిహితులు... నువ్వు అందంగా ఉంటావు, ఎందుకు సినిమాల్లోకి వెళ్ళకూడదు అని ఫోర్స్ చేశారట. అయినా మురళీ మోహన్ ఆసక్తి చూపలేదట. 

 

35
Sridevi

కానీ అట్లూరి పూర్ణచంద్రరావు పిలిచి అవకాశం ఇస్తాను అనడంతో కాదనలేకపోయాడట. సినిమా ఆఫర్స్ పెరగడంతో వ్యాపారం వదిలేసి నటుడిగా మారాడట. శ్రీదేవి హీరోయిన్ గా మొదటి చిత్రం మురళీ మోహన్ తోనే అట. తర్వాత వీరిద్దరూ కలిసి చాలా చిత్రాలు చేయడంతో శ్రీదేవి తల్లికి మురళీ మోహన్ పట్ల సానుకూల భావన కలిగిందట. 

45
Sridevi

అబ్బాయి అందంగా ఉన్నాడు. మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. శ్రీదేవిని మురళీ మోహన్ కి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుంటుందని తల్లి భావించారట. ఇదే విషయం కొందరు సన్నిహితులతో చెబితే... ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు అని చెప్పారట. అయితే శ్రీదేవి తల్లి నమ్మలేదట. 

 

55
Sridevi

ఒకసారి శ్రీదేవితో పాటు తల్లి మురళీ మోహన్ ఇంటికి వెళ్లారట. అక్కడ మురళీ మోహన్ భార్య పిల్లలను చూశారట. అప్పుడు నిజమే అని నమ్మారట. ఒకవేళ మురళీ మోహన్ కి వివాహం కాకుండా ఉండి ఉంటే... శ్రీదేవితో ఆయనకు వివాహం జరిగేది. బాలీవుడ్ కి వెళ్లిన శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది.. 
 

click me!

Recommended Stories