పిల్లలపై భారం మోపుతున్నారు.. హీరోయిన్ శ్రియ శరణ్ కామెంట్స్ వైరల్, తాను బాధితురాలినేనన్న బ్యూటీ.

Published : May 09, 2023, 11:21 AM ISTUpdated : May 09, 2023, 11:23 AM IST

ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళకుపైనే అవుతున్నా.. ఏమాత్రం తన్నెతగ్గలేదు హీరోయిన్ శ్రీయ శరణ్. తాజాగా ఆమె చిన్న పనిల్లలు, చదువుకునే పిల్లల గురించి మాట్లాడారు, పెద్దస్పీచ్ కూడా ఇచ్చారు. 

PREV
16
పిల్లలపై భారం మోపుతున్నారు.. హీరోయిన్ శ్రియ శరణ్  కామెంట్స్ వైరల్, తాను బాధితురాలినేనన్న బ్యూటీ.

 ఇంత వరకూ తన కెరీర్ లో ఎప్పుడు స్పందించని విధంగా డిఫరెంట్ గా...  పిల్లల విషయంలో స్పందించారు హీరోయిన్ శ్రియ శరణ్. పిల్లల్ని ఎలా పెంచాలన్న విషయాలపై శ్రియ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలిసో, తెలియకో చదువుల పేరుతో ఇప్పటి జనరేషన్ పేరెన్స్ వారిమీద మితిమీరిన భారాన్ని నెడుతున్నారన్నారు. 

26

మితిమీరిన భారాన్ని మోపుతుండటంతో...  ఆ చిన్నారులపై మానసిక ఒత్తిడి పెరిగి.. వారు  సతమతమవుతున్నారని చెప్పుకొచ్చింది బ్యూటీ. అంతే కాదు తను కూడా చిన్నతనంలో ఇలాంటి బాధలని అనుభవించినదాన్నే అంటూ.. చెప్పుకొచ్చింది శ్రీయ... 9th క్లాస్ తరువాత వ్యాపకం లేకుండా పోయిందన్నారు. దాంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానంటూ.. చెప్పుకొచ్చారు శ్రీయా.  

36

అయితే  అమ్మ మాత్రం తన బాధను బాగా అర్ధం చేసుకుందని.. తనని డ్యాన్స్‌ వైపు ప్రోత్సహించిందంటోంది. అమ్మవల్లనే కథక్‌ నేర్చుకున్నాని చెప్పుకొచ్చారు శ్రీయా శరణ్. అంతే కాదు అప్పుుడు అమ్మ ప్రోత్సహించడం వల్లే.. ఇప్పుడు తాను హీరోయిన్ గా ఈ స్థాయిలో ఉన్నానంటోంది. 

46

అంతే కాదు ఇప్పుడు  పేరెంట్స్‌ ఆలోచనల గురించి కూడా మాట్లాడింది శ్రీయ. ఒకప్పుడు 100 కు 90 మార్కులు వస్తే..తల్లీ తండ్రులు ఎంతో సంతోషించేవారని.. కాని ఇప్పుడేమో.. 99 వచ్చినా.. ఆ ఒక్క మార్కు ఎతందుకు మిస్ అయ్యింది అననట్టుగా ఆలోచిస్తున్నారన్నారు శ్రీయా.  ఈ పరిస్థితుల్లో చిన్నారుల్ని కళలవైపు ప్రోత్సహించేవాళ్లు చాలా అరుదు అన్నారు. 

56

ముఖ్యంగా సంగీతం, డాన్స్‌ క్లాసుల సమయంలో మా పిల్లలు హోమ్‌వర్క్‌ చేసుకుంటారనేవాళ్లే ఎక్కువ. కానీ చిన్నారుల్ని కళలు, ఆటలవైపు ప్రోత్సహిస్తే ఆ ఫలితాలే వేరుగా ఉంటాయి. జీవితాంతం మనతోపాటు ఉండేవి అవే. కళలు, ఆటలతో క్రమశిక్షణ పెరుగుతుంది. పెద్దవాళ్లని ఎలా గౌరవించాలో తెలుస్తుంది అంటూ వివరంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది శ్రీయ శరణ్. 

66

శ్రీయా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి  22 ఏళ్లకు పైనే అవుతోంది. ఇప్పటికీ లీడ్ రోల్స్ చేసతూ.. గ్లామర్ ను ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ..  లైమ్‌లైట్‌లో ఉంటోంది. వరుస సినిమాల్లో నటిస్తూ మెస్మరైజ్‌ చేస్తోంది. ఇక తాజా శ్రియ నటించిన సినిమా మ్యూజిక్‌ స్కూల్‌. పాపారావు బియ్యాల డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన ఈసినిమా ఈవారం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆమె.. ఈ విధంగా కామెంట్స్ చేశారు. 
 

click me!

Recommended Stories