స్టార్ డమ్ పెరిగే కొద్దీ సావిత్రి బిజీ అయ్యారు. అలాగే సావిత్రి ఆహార ప్రియురాలు అని సమాచారం. దాంతో సావిత్రి బరువు పెరుగుతూ పోయారు. కానీ ఈ విషయం ఆమెతో ఎవరు చెప్పలేదు. స్టార్ హీరోయిన్ కావడంతో ఆ సాహసం చేసి ఉండదు. కానీ తాను లావైన విషయాన్ని సావిత్రి ఒకరోజు స్వయంగా తెలుసుకుందట.
ఒక మూవీ షూటింగ్ జరుగుతుండగా... సెట్ లో తనలాగే కాస్ట్యూమ్స్ ధరించిన ఓ లావాటి మహిళ అటుగా వెళుతుందట. సావిత్రి ఆమెను చూసి.. ఎవరని తన పక్కన ఉన్న వాళ్ళను అడిగారట. ఆమె మీ డూప్ మేడం. ఇవాళ నైట్ మొత్తం షూట్ ఉంది. మీ లాంగ్ షాట్స్ ఆమెతో చేస్తున్నాం, అన్నారట. ఆ మాటలకు సావిత్రి ఒకింత షాక్ అయ్యారట. తన డూప్ ని చూసి నేను ఇంత లావుగా ఉన్నానా అని ఆశ్చర్యపోయిందట.