ఆ తర్వాత వసుధార రూమ్ కి వస్తాడు రిషి. అక్కడ రిషి, వసుధార ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది చూసిన జగతి ఆనందపడుతుంది. ఇద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనసులోనే దీవిస్తుంది. ఆ దృశ్యాన్ని దేవయాని చూస్తుంది. ఇప్పుడే కంటి నిండా చూసుకో ఆ తర్వాత నీకు ఆ అవకాశం ఉండకపోవచ్చు అనుకుంటుంది.