ఐశ్వర్య రాజేష్ రీసెంట్ గా నటించిన ఫర్హానా చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఐశ్వర్య రాజేష్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను తెలుగు అమ్మాయిని అయినప్పటికీ తెలుగులో అవకాశాలు అంతగా రావడం లేదు అని కుండ బద్దలు కొట్టేసింది.