ఒక హోటల్ సర్వర్ ని తండ్రిగా దత్తత తీసుకున్న రజినీకాంత్... ఆ వృద్దుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా?

First Published | Aug 14, 2024, 12:18 PM IST

హీరో రజినీకాంత్ ఒక హోటల్ లో పని చేసే వ్యక్తిని తండ్రిగా దత్తత తీసుకున్నాడు. ఆయనను ఇంటికి తీసుకెళ్లాలి అనుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అతనిలోని ప్రత్యేకత ఏమిటీ?
 


స్టార్ హీరోలు దానధర్మాలు చేయడం పరిపాటి. తమ వందల కోట్ల సంపాదనలో కొంత మొత్తాన్ని సామాజిక సేవకు వాడతారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి సైతం సామాజిక స్పృహ ఉంది. కాగా రజినీకాంత్ ఓ వృద్ధుడిని తండ్రిగా దత్తత తీసుకున్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆయన్ని నాన్న అంటాడట. 
 


రజినీకాంత్ దత్తత తీసుకున్న ఆ వ్యక్తిని ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. అయితే ఆయన రాను అన్నారట. రజినీకాంత్ వంటి ఓ పెద్ద సూపర్ స్టార్ దత్తత తీసుకునేంత ప్రత్యేకత ఆ వ్యక్తి వద్ద ఏముందనే సందేహం మీకు కలగవచ్చు. నిజంగా ఆ వ్యక్తి ప్రత్యేకమే. జీవితాంతం ఎలాంటి స్వార్థం లేకుండా బ్రతికాడు. తన సంపాదన ఇతరుల మంచికి ఖర్చు చేశాడు. 



పాలెం కళ్యాణ సుందరం అనే వ్యక్తి లైబ్రేరియన్ గా పని చేశాడు. 30 ఏళ్ల సర్వీసులో కళ్యాణ సుందరం తన సంపాదన మొత్తాన్ని దాన ధర్మాలకు వాడారు. పేదలకు సహాయం చేశాడు. తనకు పెన్షన్ గా వచ్చిన రూ. 10 లక్షలు కూడా ఆయన ఓ చారిటీ సంస్థకు దానంగా ఇచ్చారు. స్వార్థం వదిలేసి ఇతరుల కోసమే ఆయన బ్రతికాడు. 

కళ్యాణ సుందరం సేవలను గుర్తించిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ 20వ శతాబ్దపు అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించింది. కళ్యాణ సుందరాన్ని రజినీకాంత్ నాన్న అంటారట. ఆయన్ని తన ఇంటికి తీసుకువెళ్లాలని చాలా సార్లు ప్రయత్నం చేశాడట. కానీ రజినీకాంత్ ఆఫర్ ని కళ్యాణ సుందరం సున్నితంగా తిరస్కరించాడట. 

నిరాడంబరంగా జీవించడానికే కల్యాణ సుందరం ఇష్టపడతారట. కళ్యాణ్ సుందరం ఓ 10 ఎల్లా పాటు హోటల్ లో సర్వర్ గా పని చేశాడట. కల్యాణ సుందరం గొప్పతనం గురించి తెలిసిన పలువురు కొనియాడుతున్నారు. ఇక రజినీకాంత్ విషయానికి వస్తే... టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. 

Latest Videos

click me!