భోళా శంకర్ మూవీని తిట్టండి, కానీ చిరుని పర్సనల్ గా కాదు.. ఇలాంటివి ఎన్ని చూడలేదు, హీరో కార్తికేయ 

Published : Aug 19, 2023, 01:41 PM ISTUpdated : Aug 19, 2023, 01:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంపై ఇప్పటికి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూవీపై సోషల్ మీడియాలో రిలీజైనప్పటి నుంచి ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ట్రోలర్స్ కి చిరంజీవి కూడా టార్గెట్ గా మారారు.

PREV
16
భోళా శంకర్ మూవీని తిట్టండి, కానీ చిరుని పర్సనల్ గా కాదు.. ఇలాంటివి ఎన్ని చూడలేదు, హీరో కార్తికేయ 

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంపై ఇప్పటికి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూవీపై సోషల్ మీడియాలో రిలీజైనప్పటి నుంచి ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ట్రోలర్స్ కి చిరంజీవి కూడా టార్గెట్ గా మారారు. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. కానీ కొందరు నెటిజన్లు చిరుని భోళా శంకర్ సాకుగా పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు. 

26

ఒక రీమేక్ చిత్రాన్ని ఎంచుకోవడం చిరంజీవి చేసిన మొదట తప్పు అయితే.. మెహర్ రమేష్ ని డైరెక్టర్ గా పెట్టడం రెండవ తప్పు అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే కొందరు చిరుని ట్రోల్ చేయడంపై ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ స్పందించాడు. కార్తికేయ నటించిన బెదురులంక 2012 చిత్రం ఆగష్టు 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

36

ఈ సందర్భంగా కార్తికేయ ప్రమోషన్స్ లో పాల్గొంటూ భోళా శంకర్ మూవీ గురించి స్పందించారు.కార్తికేయ మాట్లాడుతూ.. భోళా శంకర్ మూవీ బావుంది అని నేను చెప్పడం లేదు. కానీ చిరంజీవి గారు సాధించిన దానితో పోల్చితే భోళా శంకర్ 0.01 పర్సెంట్ కూడా ఉండదు. ఇలాంటివి చిరు తన కెరీర్ లో ఎన్నో అడ్డంకులు దాటుకుని వచ్చారు. అలాంటి వ్యక్తిని పర్సనల్ గా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. 

46

అసలు ఆయన సాధించిన దానిముందు వీళ్లంతా ఎవరు ? సినిమా బాగాలేకపోతే నచ్చలేదు అని చెప్పవచ్చు, మూవీని తిట్టవచ్చు. కానీ పర్సనల్ గా అటాక్ చేయడం ఏంటి. అసలు ఇలాంటి విషయాలని చిరు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన ఇంపాక్ట్ వేరే స్థాయిలో ఉంటుంది. వెంటనే నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెడతారు. ఇలాంటివి ఎన్నో అధికమించి చిరంజీవి గారికి భోళా శంకర్ చిత్రం ఒక సమస్య అవుతుందని నేను అనుకోను. 

56

చిరంజీవి గారిని మాత్రమే కాదు పర్సనల్ గా ఎవరిని ట్రోల్ చేయకూడదు. ఎందుకంటే ఒక కథ అనుకుని ఎవరైనా సినిమా చేస్తారు. అది కొన్నిసార్లు ఫెయిల్ అవ్వొచ్చు. అంతమాత్రాన అది నేరం కాదు కదా అని కార్తికేయ అన్నారు. ఇక బెదురులంక చిత్రంలో చిరంజీవి గారి అసలు పేరు కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ పెట్టడంపై కూడా కార్తికేయ స్పందించాడు. 

66

ఇటీవల విడుదలైన ట్రైలర్ లో దీనిని చూపించారు. రాంచరణ్ స్వయంగా ట్రైలర్ లాంచ్ చేయడం విశేషం. రాంచరణ్ కూడా ఆ పేరు గురించి అడిగారు. బావుంది అని ప్రశంసించారు. ఆ సన్నివేశం డిమాండ్ మేరకు అలా పెట్టినట్లు కార్తికేయ తెలిపారు. 

click me!

Recommended Stories