బ్రేకప్ అంటూ ఇదేం ట్విస్ట్... మళ్ళీ ప్రియుడితో కనిపించి షాక్ ఇచ్చిన రీతూ చౌదరి!

Published : Aug 19, 2023, 12:24 PM IST

జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి మరలా ప్రియుడితో దర్శనమిచ్చింది. ఇటీవల నేను సింగిల్ అని చెప్పిన అమ్మడు ఇలా జంటగా కనిపించడం చర్చకు దారి తీసింది.

PREV
16
బ్రేకప్ అంటూ ఇదేం ట్విస్ట్... మళ్ళీ ప్రియుడితో కనిపించి షాక్ ఇచ్చిన రీతూ చౌదరి!
Rithu chowdary

రీతూ చౌదరి గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమికుడిగా పరిచయం చేసింది. వారిద్దరి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే శ్రీకాంత్ కి రీతూ దూరంగా ఉంటున్నారని సమాచారం. 
 

26
Rithu Chowdary

ఇటీవల రీతూ ఫ్యాన్స్ తో ఆన్లైన్ లో ముచ్చటించారు. నిజాలు మాట్లాడుకుందాం పేరుతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో కొందరు ఆమెను వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. ఒకరు మీకు పెళ్ళెప్పుడు? అని అడిగారు. దానికి డోంట్ మ్యారీ బీ హ్యాపీ అని సమాధానం ఇచ్చింది. పెళ్లి వలన కష్టాలే... వివాహం చేసుకోవద్దన్న అర్థంలో ఆ కామెంట్ చేశారు. 
 

36
Rithu Chowdary


మరొకరు శ్రీకాంత్ అన్నతో మాట్లాడటం లేదా? అని అడిగారు. లేదు అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన రీతూ దీని గురించి తర్వాత వివరంగా చెబుతానని సమాధానం ఇచ్చింది. మరొకరు నీకు లవర్ ఉన్నాడా? అని అడగ్గా... దండం సింబల్ పోస్ట్ చేసింది. రీతూ సమాధానాలు నేపథ్యంలో ఆమె ప్రియుడితో బ్రేకప్ అయ్యారని అందరూ భావించారు. 
 

46
Rithu Chowdary

అనూహ్యంగా శ్రీకాంత్ తో ఉన్న ఫోటోను రీతూ చౌదరి షేర్ చేశారు. సదరు రొమాంటిక్ ఫోటోకు సీతాకోకచిలుక ఎమోజీ జోడించింది. వీరిద్దరి పోజ్ చూస్తుంటే ఒకరిని మరొకరు ఘాడంగా ఇష్టపడుతున్నట్లుగా ఉంది. మరి ఫ్యాన్స్ తో రీతూ సింగిల్ అని ఎందుకు చెప్పిందనే చర్చ మొదలైంది. రీతూ సమాధానం చెబితే కానీ దీనిపై క్లారిటీ రాదు. 
 

56
Jabardasth Rithu Chowdary


కొన్నాళ్ల క్రితం రీతూ చౌదరి జబర్దస్త్ కి రావడం జరిగింది. తెలుగమ్మాయి అయిన రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. అనంతరం సీరియల్ నటిగా మారింది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.
 

66
Rithu Chowdary


జబర్దస్త్ కి వచ్చాక రీతూకి కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటో షూట్స్ వైరల్ అవుతుంటాయి. 
 

click me!

Recommended Stories