ఈరోజు ఎపిసోడ్ లో లాస్య, నందు ఇద్దరు తులసి ఇంటికి వెళుతూ ఉంటారు. ఇప్పుడు లాస్య మరికొద్ది సేపట్లో నందు అనే బాంబు పేల పోతుంది అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు తులసి ఇంట్లో అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు శృతి డాన్స్ చేస్తూ కింద పడిపోవడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు శృతి కడుపునొప్పి అని అల్లాడుతూ ఉండగా అందరూ కలిసి శృతిని హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తారు. ఇంతలోనే నందు లాస్య అక్కడికి వస్తారు. అప్పుడు లాస్య చేసినంత చేసి పిల్లలది తప్పు లేదు వాళ్లను ఏమి అనకు తప్పంతా ఆ తులసిదే అని అంటూ మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.