Guppedantha Manasu 23rd February Episode: మనుపై పొంగుకొచ్చిన అనుపమ తల్లి ప్రేమ, మను కంటే రిషినే నయం..!

First Published | Feb 23, 2024, 8:30 AM IST

నిన్న కాక మొన్న వచ్చినవాడివి నువ్వు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నావ్.. మొన్నంటే గన్ ఉందని తగ్గాను.. ప్రతిసారీ తగ్గను. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని, తాను శాడిస్ట్, సైకోలకంటే డేంజర్ అని చెప్పి రాజీవ్ వెళ్లిపోతాడు.

Guppedantha Manasu

ntha Manasu 23rd February Episode:వసుధారను తీసుకొని వెళ్లడానికి రాజీవ్ వస్తాడు. ఈ రోజు నిన్ను నేను తీసుకొని వెళ్లకుండా ఎవరూ ఆపలేరు అని రెచ్చిపోతాడు. అనుపమ అడ్డుకోవాలని ప్రయత్నించినా వినకుండా వసుని లాక్కెళ్లబోతుంటాడు. అప్పుడే మను వచ్చి ఆపేస్తాడు. మనుని చూసి రాజీవ్ షాకౌతాడు. ఇంకోసారి వసు జోలికి వస్తే.. బులెట్ చూపిస్తానని మను వార్నింగ్ ఇస్తాడు. మను వార్నింగ్ తో రాజీవ్ ప్లేట్ తిప్పేస్తాడు. తాను వసు కోసం రాలేదని.. మనుకి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను అంటాడు. మీరు డీబీఎస్టీ కాలేజీ లో బోర్డు మెంబర్ అయ్యారని కంగ్రాంట్స్ చెబుతామని వచ్చాను అని చెప్పి.. చెప్పేసి వెళతాడు. 

Guppedantha Manasu

వెళ్లేటప్పుడు ‘డార్లింగ్ వసు.. మళ్లీ వస్తాను.. ఇఫ్పుడు వీళ్లందరినీ చూసి విర్రవీగుతున్నావేమో.. నేను నీకు బావని, వీళ్లంతా మధ్యలో వచ్చినవాళ్లు మధ్యలోనే వెళ్లిపోతారు.. చివరకు నువ్వు నేను ఒకటి, మనం మనం చుట్టాలు.. మన మధ్య రిలేషన్ ఉంది. ఇప్పుడు నేను తీసుకువెళ్లడం కుదర్లేదు కదా.. మళ్లీ వస్తాను.. అప్పుడు మాత్రం వదలను’ అంటూ.. తన జేబులో నుంచి తాళి బయటకు తీస్తాడు. ఈ తాళి మాత్రం ఎప్పటికైనీ నీ మెడలో పడాల్సిందే, నేను కట్టాల్సిందే అంటాడు. 

మను మరోసారి బయటకు వెళ్లమని అరవడంతో.. రాజీవ్ నవ్వుకుంటాడు. నిన్న కాక మొన్న వచ్చినవాడివి నువ్వు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నావ్.. మొన్నంటే గన్ ఉందని తగ్గాను.. ప్రతిసారీ తగ్గను. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని, తాను శాడిస్ట్, సైకోలకంటే డేంజర్ అని చెప్పి రాజీవ్ వెళ్లిపోతాడు.
 

Latest Videos


Guppedantha Manasu

ఇక ఇంట్లో శైలేంద్ర కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. రాజీవ్ పని పూర్తి చేసుకున్నాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. టెన్షన్ పడిపోతూ ఉంటాడు. విషయం తెలుసుకోవడానికి రాజీవ్ కి ఫోన్ చేస్తాడు. తానే చిరాకులో ఉన్నాను అంటే.. వీడి గోల ఒకటి అని రాజీవ్ ఫోన్ కట్ చేస్తాడు. మళ్లీ చేయడంతో ఇక తప్పక రాజీవ్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ ఎందుకు ఎత్తవ్ రా  అని శైలేంద్ర అంటే.. నీకు ఎందుకు చెప్పాలి రా అని సీరియస్ అవుతాడు. రా అన్నందుకు ఫీలయ్యాడని.. కూల్ గా మళ్లీ భయ్యా అని మాట్లాడతాడు. అప్పుడు రాజీవ్ కూడా మామూలుగా మాట్లాడతాడు. వసుధారను తీసుకువచ్చావా అని శైలేంద్ర అంటే.. లేదు అని చెబుతాడు. ఏం జరిగింది అని శైలేంద్ర అంటే మను గాడు అడ్డుకున్నాడు అని చెబుతాడు. మను అక్కడ ఎందుకు ఉన్నాడు అని శైలేంద్ర అంటే.. ‘నేను వెళ్తానని వాడికి ముందే మెసేజ్ వచ్చినట్లుంది. అయినా.. ఈ మనుగాడి కంటే రిషిగాడే నయం. మాటలతో మాయ చేయవచ్చు. వాడు వార్నింగ్ ఇచ్చి వదిలేసేవాడు.. వీడిని మాత్రం ఏం చేయాలో అర్థం కావడంలేదు. అందుకే వసుధారను వదిలేసి వచ్చాను’ అని రాజీవ్ చెబుతాడు.

Guppedantha Manasu

అందుకే వసుధారను వదిలేసి వచ్చావా అని శైలేంద్ర అడుగుతాడు. ఆ మనుగాడు మనకు యముడిలా తయారయ్యాడని, వాడిని ఏదో ఒకటి చేసి వసుధారను తీసుకురావాలి కదా అని శైలేంద్ర సీరియస్ అవుతాడు. దానికి రాజీవ్.. నువ్వు ఎందుకు వాడికి భయపడుతున్నావ్.. వాడిని ఏదో ఒకటి చేస్తే మనకు ఇబ్బంది ఉండదు కదా అని రాజీవ్ అంటాడు. తర్వాత.. వసు తన జీవితం అని.. ఎప్పటికైనా వసుని దూరంగా తీసుకొని వెళతాను అంటాడు. ఇంకెప్పుడు అని శైలేంద్ర అంటే.. ఓపిక ఉండాలని.. కొంత సమయం ఆగితే.. శుభవార్త వింటారుు అని రాజీవ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక.. శైలేంద్ర మనసులో రగిలిపోతూ ఉంటాడు. మను ఎవడ్రా నువ్వు.. నీకు ఆ ఫ్యామిలీకి సంబంధం ఏంటి..? నాకు ఎండీ సీటు దక్కుకుండా చేస్తున్నావ్..? ఏదో ఒకటి చేయాలి.. వసుధార కాలేజీకి దూరం అయ్యేలా చేయవాలి..? దాని కోసం ఏం చేయాలి..? అని ఆలోచించి.. ఓ కొత్త ఐడియా ఆలోచిస్తాడు.

Guppedantha Manasu

ఇక, వసుధార, మహేంద్ర, మను, అనుపమ భోజనానికి కూర్చుంటారు. అనుపమను స్వయంగా వడ్డించమని మహేంద్ర అంటాడు. ఇక.. అనుపమ వడ్డించడంతో.. అన్నీ నీకు ఇష్టమైన కూరలే కదా తినమని మహేంద్ర అంటాడు. తర్వాత ఆ రాజీవ్ గాడు ముందే తెలుసా అని అడుగుతాడు. మొన్న రాజీవ్ గాడు తనను విసిగిస్తుంటే.. మను వచ్చి సేవ్  చేశాడని వసు చెబుతుంది. కొట్టావా అని మహేంద్ర అంటే.. కాదని జస్ట్ గన్ చూపించాను అని  అంటాడు. అప్పుడు మహేంద్ర.. వాడు చాలా వెదవ అని వసుని చాలా ఇబ్బంది పెట్టాడని చెబుతాడు. చేతిలో తాళి పట్టుకొని ఉన్నాడంటేనే వాడు ఎంత వెదవో తెలుస్తుందని.. ఈసారి వాడి  చెంప పగలకొట్టమని అనుపమ సలహా ఇస్తుంది. అయితే.. ఇప్పుడంటే అందరం ఉన్నామని.. ఒక్కదానివే ఉంటే ఇబ్బందిపెడతాడేమో అని జాగ్రత్తగా ఉండమని మహేంద్ర చెబుతాడు. అయితే.. అలాంటివాడికి భయపడాల్సిన అవసరం లేదని.. వసుధారగారికి నచ్చినట్లు ఉండవచ్చని మను అంటూ ఉండగా పొరమాలుతుంది.

Guppedantha Manasu

వెంటనే అనుపమంలోని తల్లి ప్రేమ బయటకు వస్తుంది. నాన్న అంటూ లేచి.. తలనిమిరి.. మంచినీళ్లు తాగిస్తుంది. అది చూసి మహేంద్ర, వసుధార షాకౌతారు. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని తెలీదా..? మహేంద్ర నువ్వు ఎందుకు మాట్లాడిస్తున్నావ్  అని మహేంద్ర మీద సీరియస్ అవుతుంది. తనకు పొలిమారితే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని మహేంద్ర అడగడంతో అనుపమ రియాల్టీలోకి వచ్చేస్తుంది. వెంటనే నార్మల్ అయ్యి వచ్చి కూర్చుంటుంది. అదేలే..మన కాలేజీకి అంత సహాయం చేశాడు.. ఆ మాత్రం ఆప్యాయత చూపించాలి లే అని మహేంద్రే మళ్లీ కవర్ చేస్తాడు. అంతలా పొలమారింది అంటే..  ఎవరు తలుచుకొని ఉంటారు అని మహేంద్ర అంటే... నన్ను తలుచుునేవాళ్లు ఎవరూ లేరు అని మను అంటాడు.

Guppedantha Manasu

ఆ మాటకు అనుపమ బాధపడుతుంది. నోట్లోని ముద్దు కూడా కింద పడేస్తుంది. ఇంకెప్పుడు అలా అనొద్దని.. నీకు మేము ఉన్నాం అని మహేంద్ర అంటాడు. తర్వాత మను.. అందరితో కలిసి ఇలా ఎప్పుడూ తినలేదు అని బాధగా చెబుతాడు. అదేంటి అని మహేంద్ర అంటే.. తనకు ఆ అదృష్టం లేదని.. ఎప్పుడూ ఒంటరిగానే తింటాను అని అంటాడు. మహేంద్ర ఓదారుస్తాడు. నీ బాధను పంచుకోవడానికి మేం అందరం ఉన్నామని.. హ్యాపీగా ఉండమని చీర్ చేస్తాడు.

Guppedantha Manasu

ఇక... పెద్దమ్మ.. అనుపమకు ఫోన్ చేస్తుంది. పెద్దమ్మ పై అనుపమ చాలా సీరియస్ అవుతుంది. మను ఇక్కడికి వస్తాడని నీకు ముందే తెలుసు కదా అని అనుపమ అడుగుతుంది. ఆమె మాత్రం ఏమీ తెలియనట్లు అక్కడికి వచ్చాడా అని అడుగుతుంది. అనుపమ మాత్రం నీకు ముందే తెలుసని, నాకు ముందే చెప్పి ఉండొచ్చు కదా అని అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!