ప్రభాస్ హీరోయిన్ ఇప్పుడు ఇలా అయిపోయిందేమిటి..? రిచా గంగోపాధ్యాయ షాకింగ్ లుక్

Published : Jul 11, 2022, 07:12 AM ISTUpdated : Jul 11, 2022, 07:16 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ శాశ్వతం కాదు. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ. అయితే అందులో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోతుంటారు. మరికొందరు మాత్రం పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ కు అంకితం అయిపోతుంటారు.  షాకింగ్ లుక్ లో కనిపిస్తుంటారు. రీసెంట్ గా అలానే కనిపించారు ప్రభాస్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ. 

PREV
19
ప్రభాస్ హీరోయిన్ ఇప్పుడు ఇలా అయిపోయిందేమిటి..? రిచా గంగోపాధ్యాయ షాకింగ్ లుక్

సినిమాలు మానేసి ఫారెన్ లో సెటిల్ అయిన  మిరపకాయ్, మిర్చి  హీరోయిన్ ఫోటోలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో  బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఫారెన్  ఫ్యామిలీతో కలిసి నెట్టింట్లో సందడి చేస్తోంది రిచా గంగోపాధ్యాయ. అప్పటికీ ఇప్పటికీ చాలా ఛేంజ్ అయ్యింది. గుర్తుపట్టనంతగామారిపోయింది. 
 

29

లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. మాస్ మహారాజ్ రవితేజ మిరపకాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ. మిరపకాయ్ సినిమాతోనే రిచాకు మంచి గుర్తింపు వచ్చింది. హరిష్ శంకర్ రవితేజ కలయికలో వచ్చిన సినిమాలో ఆమె ట్రెడిషనల్ లుక్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.

39

న్యూఢిల్లీకి చెందిన రిచా గంగోపాధ్యాయ  పై చదువుల  కోసం అమెరికా వెళ్ళింది. రీచా అక్కడి వాతావరణంకు ఎంతగానో అలవాటైపోయింది. ఆ తర్వాత ఆమె యూఎస్ఏ లోనే మిస్ ఇండియాకి కూడా పోటీ చేసింది. 2007లో మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటం కూడా సాధించింది. ఇక అక్కడి నుంచి ఆమె దృష్టి నటనవైపు మళ్ళింది. 

49

మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న తర్వాత రీచాను తన స్నేహితులు సినిమాలవైపు ప్రోత్సహించారు. దాంతో ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆమెకు ఫస్ట్ లో  బాలీవుడ్ నుంచి  ఆఫర్లు వచ్చినప్పటికీ  ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీ పైనే ఫోకస్ చేసింది. 2010లో రానా దగ్గుపాటిని పరిచయం చేస్తూ.. శేఖర్ కమ్ములా తెరకెక్కించిన మొదటి సినిమా లీడర్ తో సిల్వర్ స్క్రీన్  ఎంట్రీ ఇచ్చింది రిచా.
 

59

ఇక లీడర్ సినిమా తరువాత వరుసగా ఆఫర్లు ఆమెను వరించాయి... రీచా గంగోపాధ్యాయ చాలా త్వరగానే టాలీవుడ్ లో ఇమిడిపోయింది. తర్వాతి కాలంలో వచ్చిన  నాగవల్లి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మిరపకాయ్ సినిమా మంచి హిట్ అయింది. అనంతరం ఆమెకు తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. అక్కడ స్టార్ హీరో ధనుష్ తో సూపర్ హిట్ మూవీలో నటించి మెప్పించింది రిచా. 
 

69

అయితే  రిచా గంగోపాధ్యాయ కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా అంటే మిర్చి. ప్రభాస్ సరసన వన్ ఆఫ్ ద హీరోయిన్ గా అనుష్కతో పాటు మిర్చ్ మూవీలో సందడి చేసింది రిచా. ఈ సినిమా  సూపర్ హిట్ తరువాత  ఇక మరోసారి రవితేజతో సారొచ్చారు అనే సినిమా చేసింది. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక నాగార్జునతో బాయ్  సినిమా చేసిన రీచా భారీ డిజాస్టర్ ఫేస్ చేసింది. 
 

79

బాయ్  సినిమా ప్లాప్ తరువాత తో మళ్ళీరిచా ఇండస్ట్రీలో కనిపించలేదు. 2013లో నాగార్జున బాయ్ సినిమా డిజాస్టర్ తరువాత  రిచా గంగోపాధ్యాయ మళ్ళీ అమెరికా వెళ్లి అక్కడే తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది. అక్కడే తన పూర్తి ఫ్యామిలీ లైఫ్ లో ఆమె ఎంజాయ్ చేస్తోంది. 

89

ఇక ఈ మధ్య రిచా ఫ్యామీల ఫోటోస్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె  కొంచెం లవెక్కినట్లు కూడా కనిపిస్తోంది. తన ఎంబీఏ ఫ్రెండ్ జోయీ లంగెళ్లను వివాహం చేసుకున్న రీచా 2021లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ప్రస్తుతం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటంది. 
 

99

ఎప్పటికప్పుడు తన కొడుకుతో ఆమె ఆడుకుంటున్న ఫొటోలను ఫ్యాన్స్ ఫాలోవర్స్ తో ఆమె షేర్ చేసుకుంటూనే ఉంది. ఇక ఆమె  మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories