రాశీ ఖన్నా ఇన్నాళ్లు టాలీవుడ్ హీరోయిన్ గా వరుస చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ పాపులారిటీని పెంచుకుంటోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హిందీలో ‘యుద్ర’ అనే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ‘సర్దార్’ అనే మరో చిత్రంలోనూ నటించింది.