మ్యాగ్నెట్ చూపులతో అట్రాక్ట్ చేస్తున్న అవికా గోర్.. క్యూట్ లుక్స్ లో మైమరిపిస్తున్న చిన్నారి పెళ్లి కూతురు..

Published : Jul 10, 2022, 09:02 PM IST

ముంబయి బ్యూటీ, టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ అవికా గోర్ (Avika Gor) లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

PREV
16
మ్యాగ్నెట్ చూపులతో అట్రాక్ట్ చేస్తున్న అవికా గోర్.. క్యూట్ లుక్స్ లో మైమరిపిస్తున్న చిన్నారి పెళ్లి కూతురు..

‘చిన్నారి పెళ్లికూతురు’ డైలీ సీరియల్ తో తెలుగువారికి పరిచయం అయ్యింది అవికా గోర్. ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’తో  హీరోయిన్ గా తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది.  అద్భుతమైన పెర్ఫామెన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. 
 

26

ఇటీవల  ఈ బ్యూటీ ‘టెన్త్ క్లాస్ డైరీస్’ (10Th Class Diaries) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియెన్స్ నుంచి ఈ మూవీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. చిత్రంలో నటుడు శ్రీరామ్ కూడా నటించారు. ఇద్దరి పెర్పామెన్స్ తో పాటు కథ అద్భుతంగా ఉందని ఆడియెన్స్ తెలుపుతున్నారు. 
 

36


గతంలోనూ సూపర్ హిట్ చిత్రాలైన ‘సినిమా చూపిస్త మావ , ఎక్కడికిపోతావు చిన్నవాడా’లతో ప్రేక్షకుల్లో మరింత  మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇటీవల అవికా గోర్ కి సరైన విజయం లేకపోయినా.. వరుసగా ఆఫర్లు మాత్రం పడుతున్నాయి. దీంతో ఈ బ్యూటీ తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది.
 

46

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. వెండితెరపైన కంటే నెట్టింట అందాలు ఒలకబోస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్  కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నారు.

56

ట్రెండీ వేర్ లో అవికా గోర్ చాలా అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. మ్యాగ్నెట్ చూపులతో యువతను తనవైపు ఆకర్షిస్తోంది. క్లోజప్ షార్ట్ లో అందాలను విందు చేసింది. గార్డెన్ లోని ప్లాంట్స్ వద్ద స్టైలిష్ గా  స్టిల్స్ ఇస్తూ మతిపోగొట్టింది.

66

ప్రస్తుతం తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన అందాన్ని పొగుడుతూ ఆమె పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. పిక్స్ ను షేర్ చేస్తూ యంగ్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటూనే ఉంది.

click me!

Recommended Stories