టోర్న్ జీన్స్ లో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న రష్మిక... అమ్మడు అన్ ప్రొఫెషనల్ లుక్ అదుర్స్!

Published : May 13, 2023, 09:05 PM ISTUpdated : May 13, 2023, 09:11 PM IST

రష్మిక మందాన ముంబై వీధుల్లో తళుక్కున మెరిశారు. టోర్న్ జీన్స్ లో ట్రెండీగా దర్శనమిచ్చారు. రష్మిక అన్ ప్రొఫెషనల్ లుక్ వైరల్ గా మారింది.   

PREV
19
టోర్న్ జీన్స్ లో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్న రష్మిక... అమ్మడు అన్ ప్రొఫెషనల్ లుక్ అదుర్స్!
Rashmika mandanna

ఓ ఫోటో షూట్ కోసం ముంబై వెళ్లిన రష్మిక కెమెరా కంటికి చిక్కారు. ఇక రష్మిక కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఆమెకు వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి. 
 

29
Rashmika mandanna

చెప్పాలంటే ఏడాది కాలంగా రష్మిక ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. సీతారామం మాత్రమే హిట్ మూవీగా ఉంది. అయితే ఆ మూవీ క్రెడిట్ అంతా మృణాల్ కి దక్కింది.

39
Rashmika mandanna

ఆడవాళ్లు మీకు జోహార్లు డిజాస్టర్ కాగా, హిందీ చిత్రాలు గుడ్ బై, మిషన్ మజ్ను నిరాశపరిచాయి. ఇక విజయ్ కి జంటగా నటించిన భారీ చిత్రం వారసుడు మిశ్రమ ఫలితాలు అందుకుంది. ఆ చిత్రంలో రష్మిక పాత్ర జస్ట్ సోసో గా ఉంటుంది. వారసుడు చిత్ర కథలో రష్మిక పాత్ర దర్శకుడు పాటలకే పరిచయం చేశాడు. 

49
Rashmika mandanna

ఇటీవల రష్మిక రెండు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు. నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. వెంకీ కుడుముల రష్మిక ఫేవరెట్ డైరెక్టర్. ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆయనే. ఛలో మూవీతో రష్మిక బోణీ అదిరిపోగా స్టార్ హీరోయిన్ గా అవతరించింది. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

59
Rashmika mandanna

అలాగే రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ. దేవ్ మోహన్ రష్మికకు జంటగా నటిస్తున్నారు. ఫాంటసీ ఎమోషనల్ లవ్ డ్రామా అంటున్నారు. ఆల్రెడీ రైన్ బో షూటింగ్ జరుపుకుంటుంది. 

69
Rashmika mandanna

ఇక రష్మిక ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ ల చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 హిందీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ఎందుకు నిదర్శనం. దాదాపు రూ. 300 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తుంన్నారు. వాచ్ ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. 
 

79
Rashmika mandanna


బాలీవుడ్ లో జెండా పాతాలని కొన్నాళ్లుగా రష్మిక గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఆమె నటించిన హిందీ చిత్రాలు గుడ్ బై, మిషన్ మజ్ను నిరాశపరిచాయి. దీంతో యానిమల్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు. 

89
Rashmika mandanna


అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నమోదు చేసిన సందీప్ రెడ్డి నుండి వస్తున్న యానిమల్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. 

99
Rashmika mandanna

కెరీర్ ఇలా ఉండగా రష్మిక తరచుగా వివాదాల్లో ఉంటున్నారు . ఆమెను కన్నడ పరిశ్రమ దూరం పెట్టిందనే వాదన ఉంది. ఒక దశలో బ్యాన్ చేయాలనుకున్నారనే ప్రచారం జరిగింది. అలాగే రష్మిక హీరో విజయ్ దేవరకొండతో ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. 
 

click me!

Recommended Stories