Published : May 13, 2023, 08:17 PM ISTUpdated : May 13, 2023, 08:29 PM IST
నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టారు. నిర్మాతగా నటిగా రాణిస్తున్నారు. నిహారిక నటించిన లేటెస్ట్ సిరీస్ డెడ్ ఫిక్సెల్స్ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
మెగా డాటర్ నిహారిక నటించిన వెబ్ సిరీస్ డెడ్ ఫిక్సెల్స్. ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల స్పందించారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్ గురించి అడగ్గా... మొదట్లో ఆ కామెంట్స్ చదివి బాధపడేదాన్ని. తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోడం లేదు.
26
సైరా నరసింహారెడ్డి మూవీలో నేను చేసిన పాత్ర మీద అనేక ట్రోల్స్ వచ్చాయి. అవి చూసినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చిందని నిహారిక అన్నారు. సినిమా-ఓటీటీ ఏదైనా ఒకటే. నేను వంద శాతం కష్టపడతాను, అని నిహారిక అన్నారు. నటనపై మక్కువతోనే పరిశ్రమలో అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చారు.
36
Niharika Konidela
ఇటీవల రామ్ చరణ్ ఓ ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. దీని గురించి నిహారికకు అడగ్గా... అవునా, నాకైతే తెలియదు. అన్నయ్యను అడిగి తెలుసుకోవాలని నిహారిక చెప్పుకొచ్చారు. హాట్ స్టార్ లో మే 19 నుండి డెడ్ ఫిక్సెల్స్ స్ట్రీమ్ కానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. డెడ్ పిక్సెల్స్ సిరీస్ ఓ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కింది. ఆన్లైన్ గేమ్స్ యూత్ ని ఊపేస్తున్నాయి. ఈ గేమ్ పార్టనర్స్ లైఫ్ పార్టనర్స్ గా కూడా మారిపోతున్నారు. ఆ కాన్సెప్ట్ తో డెడ్ పిక్సెల్స్ తెరకెక్కింది.
46
Niharika Konidela
నిహారిక ఈ సిరీస్లో గాయత్రి అనే రోల్ చేశారు. తనతో పాటు ఆన్లైన్ గేమ్ ఆడే పాత్రల్లో అక్షయ్ లాగుసాని, వైవా హర్ష నటించారు. ఇద్దరి వ్యక్తులను ఇష్టపడే అమ్మాయిగా నిహారిక క్యారెక్టర్ చూపించారు. కాగా ట్రైలర్ లో నిహారిక ఓ డైలాగ్ చెప్పారు. 'రోషన్ ఇన్ బెడ్... భార్గవ్ ఇన్ మైండ్' అని నిహారిక చెప్పిన బోల్డ్ డైలాగ్ ట్రోల్స్ కి గురైంది.
56
మరోవైపు నిహారిక విడాకుల వార్తలు దుమారం రేపుతున్నాయి. మార్చి నెలలో నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. నిహారిక-వెంకట చైతన్య విడాకులు ఖాయమేనని చిత్ర వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
66
Niharika
నిహారిక విడాకుల పుకార్లపై నాగబాబు సైతం మాట్లాడలేదు. ఆయన మౌనం వహించారు. సాధారణంగా తన కుటుంబ సభ్యుల మీద వచ్చే ఆరోపణలను నాగబాబు సహించరు. వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కూతురు లైఫ్ మేటర్ లో మాత్రం నాగబాబు సైలెంట్ గా ఉండిపోయారు.